బంపర్ ఆఫర్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీకి మైండ్ బ్లాక్, ఆ రాష్ట్రానికి !
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న మోదీ ప్రభుత్వం వరాల జల్లులు కురిపిస్తున్నది. అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భారీ మొత్తంలో నిధులు విడుదల చేశారు.
కర్ణాటక రాష్ట్రంలో రవాణా రంగంలో అభివృద్ధి విప్లవం చోటుచేసుకుంటోంది. రైల్వే, మెట్రో, రోడ్లతో సహా ఇతర రంగాల్లో అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కర్ణాటక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ఏకంగా రూ. 1,385. 50 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారులు, భూ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక ట్వీట్ చేసి అందులో వివరాలు తెలిపారు. 2,055.62 కి.మీ. పనుల కోసం ఈ డబ్బును కేటాయించామని వివరించారు. 295 పొడవైన రోడ్ల అభివృద్ధి, పటిష్టతకు ఈ నిధులు వినియోగిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కర్ణాటక రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. రోడ్ల కనెక్టివిటీని పెంచడం ద్వారా, ఇది ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.
హాసన్ జిల్లాలో 22.3 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్-373లో నాలుగు లైన్ల పనుల కోసం నుంచి రూ. 576.22 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. చిక్కమగళూరు, బేలూరు, హళేబీడు, శ్రావణబెళగొళ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు ప్రధాన లింక్‌గా ఈ కారిడార్ పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు అమలు వల్ల కనెక్టివిటీ పెరుగుతుందని, టూరిజం వృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

ఇటీవల మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో జరిగిన 22 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. 2024 చివరి నాటికి కర్ణాటక రాష్ట్ర రహదారుల రూపురేఖలు మారిపోయి అమెరికా రోడ్ల మాదిరిగా తయారు అవుతాయని అన్నారు. మైసూరు, హాసన్‌లకు రింగ్ రోడ్డు వేస్తామని, బెంగళూరు-చెన్నై నగరాల మధ్య రూ 20 వేల కోట్ల రూపాయల వ్యయంతో రహదారులు నిర్మిస్తామని, బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 2 గంటల్లో చేరుకునేలా ఆ రహదారులు తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications