కేంద్రమంత్రి కాన్వాయ్‌పై రాళ్లతో దాడి.. ఎస్పీ గుండాలేనని బీజేపీ ఆరోపణ
కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బాగల్‌కు చేదు అనుభవం కలిగింది. ఉత్తరప్రదశ్ మొయిన్ పురి జిల్లా కర్హాల్ వద్ద కొందరు దుండగులు రెచ్చిపోయారు. ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. సత్యపాల్.. కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. దాడి నుంచి కేంద్రమంత్రి తప్పించుకున్నారు. కానీ అతని వాహనం అద్దం మాత్రం పగిలిపోయింది. ఘటనను బీజేపీ ఖండించింది. ఘటన వెనక ఎస్పీ గుండాలు ఉన్నారని డిప్యూటీ సీఎం కేపీ మౌర్య ఆరోపించారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలా చేశారని తెలిపారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులు ఎంతటి వారైనా వదలబొమని చెప్పారు. ఇటు మరో బీజేపీ ఎంపీ గీతకు కూడా నిరసన ఎదురయ్యింది. ఈ రెండు ఘటనలను ఆయన ఉదహరించారు.

థానా కర్హాల్‌లో గల రాహమతుల్లాపూర్ వద్ద దాడి జరిగింది. ప్రచారం ముగించుకొని వచ్చే సమయంలో దాడి జరిగింది. ఇతర పార్టీ నేతలతో కలిసి అటికుల్లాపూర్ గ్రామానికి వెళుతున్నారు. అక్కడ అప్పటికే కొందరు ఉన్నారు. వెంటనే రాళ్లతో దాడి చేశారు. వెంటనే రాళ్లతో దాడి చేశారు. దీంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఘటనాస్థలానికి పోలీసులు వచ్చే సమయానికి రాళ్లు విసిరిన వారు పారిపోయారు.












Click it and Unblock the Notifications