పాకిస్తాన్‌కు కోట్ల రూపాయలు ఇప్పించిన గాంధీజీ.. ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం

భారతదేశానికి స్వాతంత్ర్యంతో పాటు విభజన రూపంలో రక్తపాతం, శరణార్థుల ఆక్రందనాలు ఎదురయ్యాయి. 1948 జనవరిలో మహాత్మా గాంధీ చేపట్టిన ఆఖరి ఉపవాస దీక్ష దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఒకవైపు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుంటే, మరోవైపు పాకిస్తాన్‌కు రూ. 55 కోట్లు విడుదల చేయాలని గాంధీజీ పట్టుబట్టడం అప్పట్లో పెను దుమారానికే దారితీసింది. అసలు మహాత్ముడు అంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దశాబ్దాల క్రితం నాటి సంఘటన వెనుక ఉన్న అసలు సత్యమేంటి?

విభజన గాయాలు.. ఢిల్లీ వీధుల్లో రక్తపాతం

1947 ఆగస్టు 15న దేశానికి స్వేచ్ఛ ఊపిరి లభించినప్పటికీ, మతకల్లోలాల రూపంలో సృష్టి వేదన మొదలైంది. లక్షలాది మంది శరణార్థులు అన్నీ కోల్పోయి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రతి వీధిలోనూ అసహనం, కక్ష సాధింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. హింసను ఆపడానికి మిలిటరీ, పోలీసు బలగాలు రంగంలోకి దిగినప్పటికీ, మనుషుల మనస్సులోని ద్వేషాన్ని అవి తుడిచిపెట్టలేకపోయాయి.

Untold Story of Mahatma Gandhi Final Fast and the Controversy Surrounding 55 Crore Payment to Pakistan

కేవలం చట్టం ద్వారా వచ్చే శాంతి కంటే, హృదయాల కలయిక ద్వారా వచ్చే ఐక్యతే శాశ్వతమైనదని గాంధీజీ దృఢంగా నమ్మారు. ఈ క్రమంలోనే మైనారిటీల రక్షణ కోసం, దేశంలో సోదరభావాన్ని పునరుద్ధరించడానికి ఆయన తన 78 ఏళ్ల వయస్సులో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆఖరి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

పాకిస్తాన్‌కు రూ. 55 కోట్లు.. గాంధీజీ పట్టుబట్టడానికి కారణమేంటి?

ఉపవాస దీక్ష వెనుక ప్రశాంతతను పునరుద్ధరించడమే ప్రధాన లక్ష్యమైనప్పటికీ, పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన రూ. 55 కోట్ల బకాయిల అంశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆస్తిపాస్తుల విభజన ఒప్పందం ప్రకారం బ్రిటీష్ ఇండియా నుంచి భారతదేశానికి వచ్చిన మొత్తం నిధులలో పాకిస్తాన్‌కు రూ. 75 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో రూ. 20 కోట్లు ఇప్పటికే ఇచ్చేశారు.

'ధురంధర్' గా మారి.. పాకిస్థాన్ ఆర్మీని లేపేసేందుకు.. బెంగళూరు కుర్రాడి మాస్టర్ ప్లాన్.. కానీ..!
'ధురంధర్' గా మారి.. పాకిస్థాన్ ఆర్మీని లేపేసేందుకు.. బెంగళూరు కుర్రాడి మాస్టర్ ప్లాన్.. కానీ..!

అయితే, సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్ మద్దతుతో కశ్మీర్‌పై దాడి జరగడంతో భారత ప్రభుత్వం మిగిలిన రూ. 55 కోట్లను నిలిపివేసింది. మన సైనికులపై దాడి చేస్తున్న దేశానికి మనమే డబ్బులు ఎలా ఇస్తామన్నది నాటి ప్రభుత్వ పెద్దల వాదన. కానీ, గాంధీజీ కోణం వేరుగా ఉంది. ఒకరికి ఇవ్వాల్సిన బాకీని సరిహద్దు గొడవలతో ముడిపెట్టడం నైతికంగా సరికాదని, మాట తప్పడం భారతీయ సంస్కృతి కాదని ఆయన భావించారు.

నెహ్రూ, పటేల్‌లతో తీవ్ర చర్చలు.. ఆందోళనలో దేశం

గాంధీజీ తీసుకున్న హఠాత్ నిర్ణయం అటు జవహర్‌లాల్ నెహ్రూను, ఇటు సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బిర్లా హౌస్‌లో మంచానికే పరిమితమైన గాంధీజీ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో ప్రభుత్వ నాయకులు ఆయన వద్దకు వచ్చారు. పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించిన పటేల్‌తో గాంధీజీ అన్న మాటలు నాటి రాజకీయ ఉద్రిక్తతలకు అద్దంపడతాయి.

1947లో భారత్‌లోనే కలవాల్సిన దుబాయ్! మన పాస్‌పోర్ట్‌తో అరబ్ ప్రజలు...
1947లో భారత్‌లోనే కలవాల్సిన దుబాయ్! మన పాస్‌పోర్ట్‌తో అరబ్ ప్రజలు...

"నువ్వు పాత పటేల్వి కావు" అంటూ గాంధీజీ వ్యాఖ్యానించినట్లు కొన్ని చారిత్రక ఆధారాలు పేర్కొంటాయి. డబ్బుల విషయం పక్కన పెడితే, ఢిల్లీలో ముస్లింల భద్రత, ఆక్రమణకు గురైన ప్రార్థనా మందిరాల పునరుద్ధరణ వంటి ఏడు కఠిన నిబంధనలను గాంధీజీ ప్రభుత్వం ముందు ఉంచారు.

ప్రజల ఆగ్రహం.. శరణార్థుల ఆక్రోశం

ఈ దీక్ష అందరికీ ఆమోదయోగ్యంగా మారలేదు. విభజన హింసలో సర్వస్వం కోల్పోయి, పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందూ, సిక్కు కుటుంబాలు గాంధీజీ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బిర్లా హౌస్ బయట ధర్నాలు చేస్తూ, గాంధీజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని మరచి, అవతలి వైపు నిలబడిన వారికి గాంధీజీ కొమ్ము కాస్తున్నారనే భావన చాలామందిలో కలిగింది. అయినప్పటికీ, తన మనస్సాక్షి చెప్పిన మార్గాన్నే నమ్ముకున్న గాంధీజీ, కక్ష్య సాధింపు చర్యల వల్ల ఒక తరం నాశనం అవుతుందే తప్ప ప్రశాంతత రాదని తేల్చి చెప్పారు.

శాంతి ఒప్పందం.. ఆగిన ఉపవాసం

గాంధీజీ ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని గ్రహించిన లీడర్లు, దాదాపు రెండు లక్షల మంది పౌరులు శాంతి పత్రాలపై సంతకాలు చేశారు. ఢిల్లీలోని అన్ని మతాల నాయకులు ఏకమై మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అటు పాకిస్తాన్‌లోనూ ఈ వార్త పెద్ద ఎత్తున చలనం తెచ్చింది. గాంధీజీ ఉదారతకు అద్దం పడుతూ భారత ప్రభుత్వం కూడా రూ. 55 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. దీంతో జనవరి 18న అన్ని వర్గాల హామీతో గాంధీజీ నిమ్మరసం తాగి తన దీక్షను విరమించారు.

దేశాన్ని నిలువునా చీల్చిన వేళ.. భారత్‌ నడిబొడ్డున 4,000 కిలోమీటర్ల గోడ!
దేశాన్ని నిలువునా చీల్చిన వేళ.. భారత్‌ నడిబొడ్డున 4,000 కిలోమీటర్ల గోడ!

చరిత్రలో మిగిలిన మహాత్ముడి నైతిక ముద్ర

ఆ రూ. 55 కోట్ల విడుదల అనేది ఆనాటి ప్రజలలో ఎంతటి ఆగ్రహాన్ని నింపిందో, ఆ తర్వాత జరిగిన దారుణ పరిణామాలు నిరూపించాయి. కానీ, గాంధీజీ దృష్టిలో ఒక దేశం తన నైతిక విలువలను ఎప్పటికీ కోల్పోకూడదు. శత్రుత్వంతో ఉన్నప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే నిజమైన భారతీయం అని ఆయన నమ్మారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఎదురైన ఆ మహా సంక్షోభంలో గాంధీజీ తీసుకున్న ఈ నిర్ణయం.. నేటికీ భారత చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన, అదే సమయంలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టంగా మిగిలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+