Yogi Adityanath: శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు ఆవు పిడకలు వాడాలన్న యోగి ఆదిత్యనాథ్..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో ఆవు పేడ పిడకల వినియోగం పెంచాలన్నారు. శ్మశానవాటికలలో అంత్యక్రియలకు ఉపయోగించే కలపలో 50 శాతం ఆవు పేడ పిడకలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆవు పేడ పిడకలను శ్మశానవాటికలకు అందుబాటులో ఉంచడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంబంధిత గోసంరక్షణ కేంద్రం నిర్వహణకు ఉపయోగించాలన్నారు.
గోసంరక్షణ ప్రదేశాల్లో సంరక్షకులను నియమించాలని యోగి అన్నారు. పశువులు అనారోగ్యంతో చనిపోయినప్పుడు, సంరక్షకుడు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆవులను కూడా ఎప్పటికప్పుడు నడకకు తీసుకెళ్లాలని యోగా ఆదేశించారు. 17 మునిసిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 'పశువు క్యాచర్' వాహనం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జంతు సంరక్షణ, సంరక్షణ కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని యోగి చెప్పారు.
ప్రజల మనోభావాలకు గౌరవం ఇస్తూ.. బలహీనంగా ఉన్న పశువుల సంరక్షణ, వాటి మేత కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తుందన్నారు. ప్రస్తుతం 6719 పశుసంరక్షణ కేంద్రాల్లో 11.33 లక్షలకు పైగా పశువులను సంరక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

అవు పిడకల కంటే ఎలక్ట్రిక్ శ్మశానవాటిలో దహనం చేయాలని సీనియర్ సిటిజన్ మహేంద్ర నాథ్ సింగ్ అన్నారు. ఇలా చేయడం వల్ల పోల్యూషన్ కూడా తగ్గుతుందన్నారు.












Click it and Unblock the Notifications