గ్యాంగ్ రేప్ చేసి స్త్రీని నగ్నంగా చెట్టుకు కట్టేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దారుణాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. 33 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమెను నగ్నంగా చెట్టుకు కట్టేశారు. సామూహిక అత్యాచారం చేసినవారిలో ఓ పాఠశాల ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు.
ఆ దారుణమైన సంఘటన 16, 17 తేదీల మధ్య రాత్రి జరిగింది. అఖిలేష్ యాదవ్ సతీమణి డిపుల్ కపాడియా ప్రాతినిధ్యం వహిస్తున్న కన్నౌజ్ నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది. ఉమార్దా పోలీసు స్టేషన్‌లో ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఎఫ్ఆర్ఐ మేరకు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయుడు మాత్రమే కాకుండా గ్రామ పెద్ద కుమారుడు.
బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ దారుణాలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications