వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ సాయం యూపీఏ తీసుకుంది: కేరళ వరదలపై సంజయ్ బారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విదేశీ సాయాన్ని తీసుకోలేదని, అయితే అనంతరం పునరావాస కార్యక్రమాల కోసం మాత్రం విదేశాల సాయాన్ని తీసుకున్నట్టు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు వెల్లడించారు.

వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ సాయం తీసుకోవడంపై ఉన్న విధి, విధానాల్లో అనేక మార్పులు తీసుకువచ్చినట్టు తెలిపారు. కేరళకు యూఏఈ ప్రకటించిన రూ. 700 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం తిరస్కరించడంపై వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే.\

 UPA accepted aid for rehab, says sanjay baru

ఈ నేపథ్యంలో సంజయ్ బారు స్పందించారు. పునరావాస కార్యక్రమాలను సంబంధించి నిధులు స్వీకరించడంలో ఎలాంటి అడ్డంకులు లేవని సంజయ్‌ తన ట్విట్టర్‌ఖాతాలో పేర్కొన్నారు. గల్ఫ్‌దేశాలతో కేరళకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఈ నేపథ్యంలో ఆ దేశాల నుంచి వచ్చే సాయాన్ని తీసుకోకపోవడంలో అర్థం లేదన్నారు.

యూఏఈలో దాదాపు 30 లక్షల వరకు భారతీయులు ఉన్నారు. వీరిలో అత్యధికులు కేరళకు చెందినవారు. యూఏఈతో పాటు ఖతర్‌, మాల్దీవులు, థాయ్‌లాండ్‌ కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకువచ్చాయి.

అయితే కేంద్రం ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. నిబంధనలు ఎత్తివేసి కేరళకు చేయూతనివ్వాలని కేరళలోని పలు రాజకీయపక్షాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ నిధులను కేరళకు తీసుకువచ్చేందుకు కేంద్రం అనుమతించాలని లేకుంటే రూ.700 కోట్లను కేంద్రమే ఇవ్వాలని కేరళ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది.

English summary
Referring to the Centre's refusal to accept Rs 700 crore from the United Arab Emirates (UAE) for flood relief in Kerala, Sanjaya Baru, ex-media advisor to former PM Manmohan Singh, said on Thursday that although the UPA government didn't seek foreign aid for natural calamities, it did accept support for rehabilitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X