వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మే 23న రండి , చర్చిద్దాం..వైసీపీ,టీఆర్ఎస్,బీజేడీలకు సోనియా గాంధీ లేఖలు

|
Google Oneindia TeluguNews

ఎన్నికల ఉత్కంఠకు మరోవారం రోజుల్లో తెరపడనున్న నేపథ్యంలో యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఫలితాలపై సిరియస్‌గా ద‌ృష్టిసారించారు. పలు పార్టీల మద్దతు కూడగట్టడడం కోసం ఆమే నేరుగా రంగంలోకి దిగారు. ఈనేపథ్యంలో మే 23న ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలోనే ఆరోజు యూపిఏ పక్షాలతోపాటు బీజేపీయోతర పక్షాలతో సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం . ఇందులో బాగంగానే ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న మే 23న బీజేపీయోతర పక్షాలైన వైఎస్ఎస్ఆర్సీ, టీఆర్ఎస్, బీజేడితోపాటు ఇతర యూపిఏ పక్షాలైన టీడీపీతో కూడ ఆమే సమావేశం కానున్నారు.ఇందుకు సంబంధించి,ఆయా పార్టీల అధినేతలకు ఆమే స్యయంగా లేఖలు రాస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఓ నేషనల్ మీడీయా వార్తలను వెలువరించింది.

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసిఆర్ డీఎంకే అధినేతతో సమావేశం అయిన నేపథ్యంలో ఆయన యూపిఏకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తోకూడ కాంగ్రేస్ పార్టీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ బీజేడీ అధినేత ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌తో 23న జరిగే సమావేశానికి రావాలని ఆహ్వానించినట్టు బీజేడీ పార్టీ నాయకులు చెప్పినట్టు సమాచారం.

UPA chairperson Sonia Gandhi has written letters to of parties

కాగా 2014 లో బీజేడీకి 20 సీట్లు టీఆర్ఎస్‌ 11 వైఎస్ఆర్సీపీ 8 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే .మొత్తం కలిపితే 39 సీట్లు ఉన్న నేపథ్యంలో ఈసారి వాటి సంఖ్య పెరిగే అవకాశం కూడ కనిపిస్థుండడంతో అటు,యూపిఏ,ఇటు ఎన్డీఏ పక్షాలు దక్షిణాదీ పార్టీలపై ఎక్కువగా ద‌ృష్టిపెట్టాయి. ఇందులోబాగంగానే ఒడిశ తుఫాను నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఒడిశ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో మంచి సంబంధాలను కనబర్చారు. మరి ఫలితాల రోజున ఎన్డీఏయోతర పార్టీలు ఏ వైపు మొగ్గుచూపుతాయో వేచి చూడాలి.

English summary
UPA chairperson and former Congress president Sonia Gandhi has written to a number of parties - both UPA allies and other non-NDA parties - including the BJD, YSRCP, TDP and TRS inviting them for a meeting on result day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X