వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓవర్ టైం డ్యూటీ: 17గంటల పాటు రైలును నిలిపేశాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఓవర్ టైం డ్యూటీలు రైల్వే సిబ్బందికి, పాలనా యంత్రాంగానికి మధ్య వివాదం రగిలిస్తున్నాయి. ఇటీవల వరుసగా ఓవర్ టైం డ్యూటీలు చేసి అలసిపోయిన ఓ రైలు డ్రైవర్ చివరకి ఒకరోజు తాను నడపాల్సిన గూడ్సు రైలును స్టేషన్లో 17 గంటలపాటు నిలిపేశాడు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని భదోహీ ప్రాంతానికి చెందిన ఓ రైలు డ్రైవర్‌ తాను నడుపుతున్న గూడ్స్‌ రైలుని స్థానిక మోధ్‌ రైల్వేస్టేషన్లో పదిహేడు గంటల పాటు నిలిపాడు. ఇలా పట్టాలపై రైలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను దారి మళ్లించ వలసి వచ్చింది. మరికొన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి.

Upset over overtime duty, driver halts train for 17 hours

మూడేళ్ల బాలిక మృత్యుంజయురాలు

12 గంటల పాటు బోరు బావిలో మృత్యువుతో పోరాడి గెలిచింది ఓ బాలిక. రాజస్థాన్‌లోని దౌసా గ్రామంలో మూడేళ్ల బాలిక ఆడుకుంటూ బోరు బావిలో పడింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది.

విషయాన్ని గమనించిన బాలిక తల్లి స్థానికులకు తెలిపింది. అధికారులు, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. పన్నెండు గంటల పాటు నిర్విరామంగా శ్రమించి బాలికను సురక్షితంగా బయటకు తీశారు.

ఈ 12 గంటల సమయంలో సీసీ కెమెరా సహాయంతో లోపలికి ఆక్సిజన్, నీరు, బిస్కట్లు పంపారు. బోరు బావి లోపల ఉన్న బాలిక ఒక బిస్కట్‌ను తిని నీరు తాగిందని అధికారులు తెలిపారు. ఎట్టకేలకు బాలిక ప్రాణాలతో బయటపడినందుకు తల్లిదండ్రులు, స్థానికులు, అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Upset over overtime duty, driver halts train for 17 hours
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X