అమెరికా నుంచి తరలివచ్చిన అక్రమ వలసదారులు: తెలుగువాళ్లూ ఉన్నారన్నారు గానీ
Donald Trump: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు.
అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి అమెరికా తెర తీసింది కూడా. వారిని ఆ దేశ ప్రభుత్వమే వెనక్కి పంపిస్తోంది. విదేశాంగం- రక్షణ మంత్రత్వ సంయుక్తంగా ఈ ఏరివేతను చేపట్టాయి. తొలి దశలో 205 మంది భారతీయులను మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్కించింది. మంగళవారమే సీ-17 ఫ్లైట్ టెక్సాస్లోని శాన్ అంటానియో విమానాశ్రయం నుంచి బయలుదేరింది.

కొద్దిసేపటి కిందటే భారత్‌కు చేరుకుంది. పంజాబ్ అమృత్‌సర్‌లోని శ్రీగురు గోవింద్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఉదయమే ఈ విమానం వస్తుందని భావించనప్పటికీ- అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు. ఈ 205 మంది కోసం అమృత్‌సర్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఇమ్మిగ్రెంట్స్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోన్నారు. డిపోర్ట్ అయిన వెంటనే పాస్‌పోర్టులు, ఇతర డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. వారి స్వస్థలాలకు తరలి వెళ్లడానికి అనుమతి ఇస్తామని చెప్పారు. అమెరికాలో నేరాలకు పాల్పడి ఉండొచ్చనే కారణంతోనే ప్రత్యేకంగా తనిఖీలను నిర్వహించినట్లు గౌరవ్ యాదవ్ తెలిపారు.
వీరిలో 104 మంది అమృత్‌సర్, సమీప ప్రాంతాలకు చెందిన వాళ్లే. కపుర్తలావాసులు అధికంగా ఉన్నారిందులో. 33 మంది హర్యానా, గుజరాతీయులు. అమృత్‌సర్ టౌన్- 5, జలంధర్-, పటియాలా-4, హోషియార్‌పూర్- 2, లూధియానా- 2, ఎస్‌బీఎస్ నగర్, గుర్దాస్‌పూర్, తర్న్ తరణ్, సంగ్రూర్, మొహాలి, ఫతేపూర్ సాహిబ్‌కు చెందిన వాళ్లు ఒక్కొక్కరు ఉన్నారు.
ఈ 205 మందిని స్వదేశానికి పంపించడం పట్ల భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. అక్రమ వలసదారులను అరికట్టే క్రమంలో దేశ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేసుకుంటోన్నామని తెలిపింది. ఇమ్మిగ్రేషన్స్ చట్టాలను మరింత కఠినతరం చేస్తోన్నామని పేర్కొంది.
అక్రమంగా తమ దేశంలో నివసించే వారి పట్ల ఉపేక్షించదలచుకోవట్లేదని తమ ప్రభుత్వం భావిస్తోందని వివరించింది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తోన్న వారిని వెనక్కి పంపించే ప్రక్రియ మరింత వేగవంతమౌతుందని, ఈ చర్య అక్రమ వలసదారులకు ఓ స్పష్టమైన సందేశాన్ని పంపించాయని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి స్పష్టం చేశారు.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications