Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూఎస్- ఇండియా స్పేస్ బిజినెస్ ఫోరం.. కీలక నిర్ణయాలు ఇవే..

యూఎస్- ఇండియా స్పేస్ బిజినెస్ ఫోరం బెంగళూరులో ఫిబ్రవరి 10-11, 2026 తేదీల్లో జరిగింది. ఈ సమావేశానికి ఇరు దేశాలకు చెందిన సీనియర్ అధికారులు, ఇండస్ట్రీ లీడర్స్ హాజరయ్యారు. అమెరికా నుంచి వాణిజ్య అంతరిక్ష వ్యాపార బృందం భారత్ కు వచ్చిన సందర్భంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఫోరం భారత్, అమెరికా మధ్య అంతరిక్ష వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఓ కీలక ముందడుగుగా నిలిచింది.

యూఎస్- ఇండియా స్పేస్ బిజినెస్ ఫోరం బెంగళూరులో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ఇరు దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష వ్యాపార బృందం భారత్ లో అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ బిజినెస్ ఫోరం జరిగింది. ఈ అంతరిక్ష వ్యాపార బృందంలో అమెరికాలోని 14 స్పేస్ కంపెనీలకు చెందిన 23 మంది ఎగ్జిక్యూటివ్ లు ప్రాతినిధ్యం వహించారు.

ఈ ఫోరమ్ ను చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 10-11, 2026 రెండు రోజులపాటు అట్టహాసంగా జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి దాదాపు 200 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. అలాగే SpaceX, Amazon, Axiom Space, Planet Labs తదితర 14 ప్రముఖ అమెరికన్ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇవి భారతీయ కంపెనీలతో కలిసి తయారీ, పెట్టుబడులు, ఉమ్మడి పరిశోధనల కోసం చర్చలు జరిపాయి.

ఇక యూఎస్-ఇండియా స్పేస్ బిజినెస్ ఫోరం ప్రాముఖ్యతపై అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "యూఎస్- ఇండియా భాగస్వామ్యం వ్యూహాత్మక బలాన్ని అలాగే అంతరిక్ష రంగంలో ఆవిష్కరణలు, వాణిజ్య వృద్ధి పట్ల మాకున్న ఉమ్మడి నిబద్ధతను ఈ ఫోరం ప్రతిబింబిస్తుంది. అంతరిక్ష సాంకేతికతలో అమెరికన్ కంపెనీలు ప్రపంచాన్ని ధైర్యంగా నడిపిస్తున్నాయి. ఈ సహకారాలను విస్తరించడంలో భారత్ ఒక కీలక భాగస్వామిగా ఉంది" అని పేర్కొన్నారు.

usindia Space Business Forum Kicks Off in Bengaluru city Boosting Commercial Ties amp amp Innovation

అలాగే ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ప్రసంగిస్తూ.. భారత్ అంతరిక్ష లక్ష్యాలను వివరించారు. 2028 నాటికి భారత అంతరిక్ష స్టేషన్ (BAS) మొదటి మోడ్యూల్‌ ను ప్రారంభించి.. 2035 నాటికి దానిని పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే 2040 నాటికి చంద్రునిపైకి భారతీయ వ్యోమగాములను పంపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ స్పష్టం చేశారు. అంతేకాక 2014లో కేవలం ఒక్క అంతరిక్ష స్టార్టప్ మాత్రమే ఉండగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 330 కు పైగా స్టార్టప్‌ లు ఉన్నాయని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+