యూపీలో యోగీ మరో సంచలనం-38 వేల మందిని మూసేసిన యాంటీ రోమియో స్వాడ్స్..
యూపీలో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఇప్పటివరకూ ఎన్ కౌంటర్లతో నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. దీనిపైనే ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇదే కోవలో మరో భారీ డ్రైవ్ చేపట్టింది. ఈసారి మహిళల భద్రత కోసం ఈ డ్రైవ్ చేపట్టింది.ఇందులో భాగంగా ఏకంగా 38 వేల మందిని పట్టుకుని జైళ్లలో వేశారు. దీంతో ఈ వ్యవహారం మరో సంచలనంగా మారబోతోంది. ఇంతకీ ఈ 38 వేల మందిని ఎందుకు అరెస్టు చేశారో తెలుసా మహిళల్ని వేధించినందుకు.
మహిళల భద్రతే లక్ష్యంగా యూపీలోయోగీ సర్కార్ చేపట్టిన భారీ డ్రైవ్‌లో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాల నుండి 38 వేల మంది రోడ్‌సైడ్ రోమియోలను అదుపులోకి తీసుకున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో ప్రారంభించిన ఈ యాంటీ రోమియో డ్రైవ్ 17 రోజుల పాటు సాగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపైనా మహిళలకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించారు.

మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన మిషన్ శక్తిలో భాగంగా ఈ డ్రైవ్ జూలై 21న ప్రారంభమైందని యూపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో యూపీ పోలీసులు చేపట్టిన డ్రైవ్‌లో ఇది రెండో దశ. ఈ డ్రైవ్‌లో దాదాపు 38,000 మంది రోడ్‌సైడ్ రోమియోలు, సంఘ వ్యతిరేక వ్యక్తులు సున్నితమైన హాట్ స్పాట్‌లు, ఈవ్ టీజింగ్ ఎక్కువగా జరిగే పాలైన ప్రాంతాల నుండి అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో పోలీసులు ఈ డ్రైవ్ లో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
వీరిలో 5500 మందిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 511 మందికి జరిమానా విధించారు. తద్వారా మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది. అసలే వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మహిళల భద్రత కోసం యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ పలు సంక్షేమ పథకాలతో పాటు ఇలాంటి డ్రైవ్ లు కూడా చేపడుతోంది. తద్వారా వారి ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలనేది బీజేపీ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications