భర్తకు తెలియకుండా దాచిన రూ.12 లక్షలు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాకే!
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఓ మహిళకు సంబంధించిన విచిత్రమైన, బాధాకరమైన సంఘటన వెలుగు చూసింది. బంగారు ఆభరణాలు కొనాలనే ఆశతో తన భర్తకు చెప్పకుండా దాదాపు 8 ఏళ్ల నుంచి ఇనుప పెట్టెలో దాచుకున్న రూ.12 లక్షల కరెన్సీ నోట్లను ఎలుకలు కొరికి చిత్తు కాగితాలుగా మార్చేశాయి. కష్టపడి దాచుకున్న సొమ్ము చిత్తుకాగితాలుగా మారడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
8 ఏళ్ల కష్టార్జితం వృథా
యూపీలోని గోండా జిల్లాకు చెందిన బాధిత మహిళ 2019 నుంచి బంగారం కొనాలనే ఆశతో ఇంటి ఖర్చుల నుంచి కొంచెం కొంచెం డబ్బును పక్కన పెట్టుకుంటూ ఓ ఇనుప పెట్టెలో దాచుకుంటూ వచ్చింది. ఇలా సుమారు 8 ఏళ్లలో దాదాపు రూ.12 లక్షల వరకు పొదుపు చేసింది. ఈ విషయం తన భర్తకు తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఇటీవల బంగారం కొనుగోలు చేయడానికి ఆ పెట్టె తెరిచి చూడగా.. నోట్లన్నీ ఎలుకలు కొట్టగా.. చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి ఆమె దిగ్భ్రాంతికి గురైంది. వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ తన భర్తతో కలిసి నేలపై కూర్చుని.. మిగిలిన కొన్ని మంచి నోట్లను.. బాగా దెబ్బతిన్న నోట్లను వేరుచేస్తూ కనిపించారు.

నెటిజన్ల విమర్శలు
ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు, బ్యాంకింగ్ సౌకర్యాలు విస్తృతంగా ఉన్న ఈ కాలంలో లక్షల రూపాయలను ఇంట్లో పెట్టెల్లో దాచడం అత్యంత నిర్లక్ష్యమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సొమ్మును బ్యాంక్ ఖాతాలో వేసి ఉంటే భద్రతతో పాటు వడ్డీ కూడా వచ్చి ఉండేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. వీడియోను పరిశీలించిన కొందరు నెటిజన్లు అక్కడ కనిపిస్తున్న మొత్తం లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
12 लाख रुपए के सारे नोट चूहे कुतर गए....
— Ruby Arun रूबी अरुण (@arunruby08) August 22, 2026
गोंडा जिले की एक महिला गहने खरीदने के लिए, पति से छुपाकर पिछले 8 साल से लिए के ट्रंक में पैसे जमा कर रही थी.
कल उसने मन बनाया कि अब सोना खरीद लिया जाते तो उसने बक्से से पैसे निकाले.
जब उसने नोटों के टुकड़े देखे तो सदमे में आ गई. तब जाकर… pic.twitter.com/AFqLAKH5BN
ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇలాంటి నోట్లు మార్చుకోవచ్చా?
ఎలుకలు కొట్టిన లేదా చిరిగిన నోట్ల మార్పిడిపై ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు కలిగి ఉంది. నోటులో తగినంత భాగం(సాధారణంగా 40 శాతం నుంచి 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ) చెక్కు చెదరకుండా ఉండి, నంబర్ లేదా ఇతర ముఖ్య లక్షణాలు గుర్తింపు పొందేలా ఉంటే బ్యాంకులు వాటిని స్వీకరిస్తాయి. నోటు దెబ్బతిన్న శాతాన్ని బట్టి బ్యాంకులు సగం లేదా పూర్తి రీఫండ్ మొత్తాన్ని అందజేస్తాయి. బాగా చిన్న ముక్కలుగా మారిన నోట్ల కోసం నేరుగా ఆర్బీఐ జారీ కార్యాలయంలో ప్రత్యేక ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో నగదును అసురక్షితంగా దాచుకోవడంలోని ప్రమాదాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications