వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ హిమపాతం: 11 మంది ట్రెక్కర్లు మృతి, మిగితావారి కోసం కొనసాగుతున్న భారీ రెస్క్యూ ఆపరేషన్

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రెక్కింగ్ కోసం వెళ్లిన 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. 17,000 అడుగుల ఎత్తులో ఉత్తరాఖండ్‌లోని లమ్‌ఖగా పాస్‌లో వైమానిక దళం భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించింది.

ఇక్కడ భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా పర్యాటకులు, పోర్టర్‌లు, గైడ్‌లతో సహా 17 మంది ట్రెక్కర్లు అక్టోబర్ 18న గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాను ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌తో కలిపే అత్యంత ప్రమాదకరమైన పాస్‌లలో ఒకటి - లమ్‌ఖగా పాస్‌కు వెళ్లే ప్రాంతం నుంచి ఇప్పటివరకు 11 మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశారు.

అక్టోబర్ 20 న అధికారులు చేసిన ఎస్ఓఎస్ కాల్‌కు భారత వైమానిక దళం స్పందించింది. రాష్ట్రంలోని పర్యాటక హిల్ స్టేషన్ అయిన హర్సిల్ చేరుకోవడానికి రెండు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ఛాపర్‌లను ఏర్పాటు చేసింది. కాగా, అక్టోబర్ 20 న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ముగ్గురు సిబ్బందితో ఏఎల్‌హెచ్ క్రాఫ్ట్‌లో మధ్యాహ్నం 19,500 అడుగుల గరిష్టంగా అనుమతించదగిన ఎత్తులో శోధన, రెస్క్యూ ప్రారంభించింది.

 Uttarakhand: 11 Trekkers Dead, Massive Air Force Rescue Operation Underway for other trekkers

మరుసటి రోజు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందితో ఏఎల్‌హెచ్ మళ్లీ మొదటిసారిగా గాలిలో ప్రయాణించింది, చివరకు వారు రెండు రెస్క్యూ సైట్‌లను గుర్తించగలిగారు. ఇది నాలుగు మృతదేహాలను కనుగొన్న 15,700 అడుగుల ఎత్తుకు రెస్క్యూ టీమ్‌ను చేర్చింది.

హెలికాప్టర్ మరొక ప్రదేశానికి చేరుకుని, కదలలేని పరిస్థితుల్లో ప్రాణాలతో ఉన్న వ్యక్తిని 16,800 అడుగుల ఎత్తులో గుర్తించింది. అక్టోబర్ 22న, ఏఎల్‌హెచ్ పగటిపూట గాలింపు చేపట్టింది. అననుకూలమైన భూభాగం, బలమైన గాలి పరిస్థితులు ఉన్నప్పటికీ సిబ్బంది ప్రాణాలతో బయటపడి, 16,500 అడుగుల ఎత్తు నుంచి ఐదు మృతదేహాలను నాలుగు షటిల్‌లలో తిరిగి తీసుకురాగలిగారు.

Recommended Video

India-China Stand Off : భారత్-చైనా కమాండర్ స్థాయి చర్చలు విఫలం..! || Oneindia Telugu

మరో రెండు మృతదేహాలు కనుగొనబడ్డాయి. డోగ్రా స్కౌట్స్, 4 అస్సాం, రెండు ఐటీబీపీ బృందాలు సంయుక్తంగా పెట్రోలింగ్ ద్వారా నితల్ థాచ్ క్యాంప్‌కు వాటిని తీసుకొచ్చారు. తప్పిపోయిన మిగిలిన వ్యక్తులను గుర్తించడానికి, రక్షించడానికి శోధనను ఏఎల్‌హెచ్ సిబ్బంది శనివారం చేపట్టనున్నారు. సహాయక బృందాలు మృతదేహాలను స్థానిక పోలీసులకు అప్పగించారు. గాయపడినవారిని ఉత్తరకాశీలోని జిల్లా ఆసుపత్రికి పంపే ముందు ప్రాణాలు హర్సిల్‌లో ప్రథమ చికిత్స చేయించారు. కాగా, ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో 50 మందికిపైగా ప్రజలు మరణించారు.

English summary
Uttarakhand: 11 Trekkers Dead, Massive Air Force Rescue Operation Underway for other trekkers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X