BJPకి దెబ్బ: ముఖ్యమంత్రి రాజీనామా -Uttarakhandలో రాజ్యాంగ సంక్షోభం! -ఎన్నికల వేళ కలకలం
ఒకప్పటి కాంగ్రెస్ అధిష్టానాన్ని తలపిస్తూ, ముఖ్యమంత్రుల నియామకాల విషయంలో ప్రస్తుత బీజేపీ హైకమాండ్ అనూహ్యంగా వ్యవహరిస్తున్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగ సంక్షోభం తప్పదని తెలిసినా, ఒక ఎంపీని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టి, గడువులోగా అసెంబ్లీకి పంపకుండా, తప్పని పరిస్థుల్లో రాజీనామా చేయించింది. అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. వివరాలివి..
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ శుక్రవారం నాడు తన పదవికి రాజీనామా చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఉత్తరాఖండ్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా త్రివేంద్ర సింగ్ రావత్ ను సీఎం పీఠం నుంచి దించేసిన హైకమాండ్.. పౌరీ గర్వాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతోన్న తీరత్ రావత్ ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే, ఆరు నెలల్లో ఆయన శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉండగా, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో ఇప్పుడక్కడ రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. దాన్ని నివారించేందుకు తీరత్ సంగ్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి.

గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన తీరత్ సింగ్ రావత్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పలు దఫాల చర్చలు జరిపారు. సమాలోచనలు, రాజ్యాంగ నిపుణుల సలహాల అనంతరం తీరత్ తో రాజీనామా చేయించాలని పార్టీ హైకమాండ్ డిసైడైనట్లు తెలిసింది. నడ్డా ఆదేశాల మేరకు సీఎం తీరత్ సింగ్ అతి త్వరలోనే ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసి రాజీనామాను మర్పించనున్నట్లు సమాచారం.

ఎంపీ తీరత్ సింగ్ రావత్ మార్చి 10న ఉత్తరాఖండ్ సీఎంగా పగ్గాలు చేపట్టగా, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఆయన ఆరు నెలల్లో రాష్ట్ర శాసనసభ లేదా మండలికి ఎన్నిక కావాలి. ఉత్తరాఖండ్‌లో మండలి లేనందుకు, తీరత్ సింగ్ సెప్టెంబరు 10లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. కానీ ఆయన కోసం ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా త్యాగానికి సిద్ధపడలేదు. అదీగాక, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఉప ఎన్నికకు అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి రాజీనామా చేయడం తప్ప తీరత్ కు మరో ఆప్షన్ లేకుండా పోయింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధన 151ఏ ప్రకారం.. ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఎన్నికైన అభ్యర్థికి కనీసం ఏడాది పాటు పదవీకాలం ఉంటేనే ఎన్నికలు నిర్వహించాలని నిబంధన సూచిస్తోంది. 2017లో కొలువుదీరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వ కాలం 2022, మార్చి 23తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికైన అభ్యర్థి సేవలందించేందుకు ఏడాది సమయం లేనందున ఉపఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ వాదిస్తోంది. మరోవైపు సెప్టెంబరు 10తో సీఎంకు ఉన్న ఆరు నెలల కాలం కూడా ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం రానుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తీరత్ రాజీనామాకు సిద్ధమయ్యారు.
సీఎంగా నడిచిన నాలుగు నెలల్లోనే తీరత్ సింగ్ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కొవిడ్ నియంత్రణలోనూ ఫెయిలయ్యారు. రావత్‌తో రాజీనామా చేయించి.. తిరిగి ఒకరోజు తర్వాత మళ్లీ సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ సంప్రదాయంపై గతంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తీరత్ ను తిరిగి కూర్చోబెట్టం సాధ్యం కాకుంటే, ఆయన స్థానంలో ఉత్తరాఖండ్ కు కొత్త ముఖ్యమంత్రిని నియమించాల్సి ఉంటుంది. తీరత్ సింగ్ రాజీనామాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.
-
Silver షేక్ చేస్తుంది: 45 ఏళ్ల తర్వాత కమ్ముకున్న చీకట్లు. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications