Vande Bharat Kavach: వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్-మరో టెస్ట్ పాస్..!

వందే భారత్ రైళ్లు ప్రమాదాలు జరిగినప్పుడు తట్టుకునేలా ఉన్నాయో లేదే తెలుసుకునేందుకు రైల్వే నిర్వహించిన ట్రయల్ విజయవంతమైంది.

ప్రస్తుతం భారతీయ రైల్వే నడుపుతున్న ప్రీమియం రైళ్లలో ఒకటైన వందే భారత్ (vande bharat)సర్వీస్ ప్రమాదాలు జరిగినప్పుడు తట్టుకోగలదా లేదా తెలుసుకునేందుకు తాజాగా మరో టెస్ట్ పెట్టారు. ఉత్తర మధ్య రైల్వే పరిధిలోని ప్రయాగ్ రాజ్ డివిజన్ లో వందే భారత్ రైలు కోచ్ ను 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయిస్తూ ఈ టెస్ట్ పెట్టారు. ఈ టెస్టులో వందే భారత్ పాసైనట్లు తెలుస్తోంది. దీంతో వందే భారత్ ప్రయాణికులు ఇకపై ఈ రైళ్లలో నిర్భయంగా ప్రయాణించవచ్చని రైల్వే వర్గాలు మరోసారి తేల్చిచెప్పాయి.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఇతర రైళ్ల తరహాలోనే ప్రమాదాలు జరిగినప్పుడు నష్టాన్ని తగ్గించేందుకు కవచ్ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ రైళ్ల వేగాన్ని క్రమంగా పెంచాలని భావిస్తున్న రైల్వేశాఖ అందుకు తగ్గట్టుగా ఈ కోచ్ లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు మరో పరీక్ష పెట్టింది. యూపీలోని ప్రయాగ్ రాజ్ డివిజన్లో పెట్టిన ఈ పరీక్షలో వందే భారత్ రైలు .. అత్యవసర సమయంలో ఆటోమేటిగ్గా బ్రేకులు వేసుకుని ఆగిపోయింది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన కవచ్ వ్యవస్థను రైల్వే భద్రతను పెంచే, ప్రమాదాలను నివారించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా దశలవారీగా అమలు చేస్తున్నారు.

Vande Bharat Rake Used for 160 kmph Kavach Trial on Dadri-Tundla Route

ఇదే క్రమంలో నిన్న వందే భారత్ కోచ్ లకు ఈ టెస్టు పెట్టారు. 'కవచ్' వ్యవస్థ అత్యవసర సమయాల్లో ఆటోమేటిగ్గా బ్రేకులు వేయడం ద్వారా రైలు కార్యకలాపాలను సురక్షితం చేస్తుంది. ఇది 'సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్ (SPAD)', ఎదురెదురు, వెనుకనుంచి ఢీకొనే ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది. అధిక వేగాన్ని నిరంతరం పర్యవేక్షించి నియంత్రిస్తూ, తక్కువ దృశ్యమానత, ప్రతికూల వాతావరణంలోనూ రైళ్ల సురక్షిత, సకాల కార్యకలాపాలను నిర్ధారిస్తుంది.

Vande Bharat Rake Used for 160 kmph Kavach Trial on Dadri-Tundla Route

ఈ ట్రయల్ సిరీస్‌లో ఒక ముఖ్యమైన దశ ఇవాళ ఓ ముఖ్యమైన దశ పూర్తయిందని ఉత్తర మధ్య రైల్వే తెలిపింది. 20 కోచ్‌లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ర్యాక్ ఇందులో పాల్గొన్నట్లు వెల్లడించింది. 160 కి.మీ. వేగంతో, వేగ పర్యవేక్షణ, ఆటోమేటిక్ బ్రేకింగ్ జోక్యం ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చిందని తెలిపింది. వందే భారత్ టెస్ట్‌ల అనంతరం, 'కవచ్' వ్యవస్థను సాంప్రదాయ కోచ్ కంపోజిషన్‌లతో పరీక్షిస్తారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఇతర కోచ్ లకు ఈ టెస్టులు పెడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+