బెయిల్ వచ్చింది, బిగ్ బాస్ హౌస్ లో రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్, ఒక్క కేసుతో ఎంత క్రేజ్ వచ్చిందంటే ?
బెంగళూరు: పులి గోళ్ల లాకెట్టు కేసులో అరెస్టు అయిన కన్నడ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ వర్తూరు సంతోష్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వర్తూరు సంతోష్ బెయిల్ మంజూరు చేస్తూ బెంగళూరులోని రెండో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గత ఆదివారం (అక్టోబర్ 22) బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వర్తూరు సంతోష్ ను కర్ణాటక అటవీ శాఖ అధికారులు అరెస్టు చేయడంతో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ సమయంలో వర్తూరు సంతోష్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను అక్టోబర్ 26వ తేదీన విచారించిన న్యాయమూర్తి బెయిల్ దరఖాస్తుపై నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.

ఈ మేరకు అక్టోబర్ 27వ తేదీన శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కోర్టు బెయిల్ ఆర్డర్ జైలుకు చేరిన తర్వాత వర్తూరు సంతోష్ విడుదల కానున్నారు. పరప్ప అగ్రహార సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత వర్తూరు సంతోష్ మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతే దాన్ని ఎలిమినేషన్‌గా పరిగణిస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వారిని మళ్లీ హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు బిగ్ బాస్ అనుమతిస్తారా అనేది ప్రేక్షకుల ప్రశ్న. దీంతో పాటు వర్తూరు సంతోష్ మళ్లీ బిగ్ బాస్‌లోకి అనుమతించాలని పలువురు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వర్తూరు సంతోష్ పక్కాగా బిగ్ బాస్ షోలో అడుగుపెడుతారని సంబధిత వర్గాలు తెలిపాయని కన్నడ మీడియా అంటోంది.












Click it and Unblock the Notifications