పంచుకుంటూ పోతే పంచెలే: వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ ధర్నా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆయన లోక్‌సభలో ప్రసంగించారు. సబకా సాత్.. సబ్‌కా వికాస్.. తమ పద్ధతి అని వెంకయ్య నొక్కిచెప్పారు. మోడీ పాలనపై ప్రజలకు విశ్వాసముందని, అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు.
దేశంలో ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాలపై దాడి జరిగినా ఖండించాలన్నారు. సంపదను అందరికీ పంచాలంటే.. అందుకు తగ్గట్టే సంపద వృద్ధి చేసుకోవాలని, అలా కాకుండా పంచుకుంటూ పోతే చివరికి పంచే మిగులుతుందని వెంకయ్య వ్యాఖ్యానించారు.

రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం కారాదని వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు విషయంలో విపక్షాల తీవ్రనిరసనలపై ఆయన స్పందిస్తూ... ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. సభ వెలుపల ఎవరో ఏదో అంటే ఇక్కడ చర్చించడం ఎలా?. ప్రపంచమంతా దేశం, ప్రధాని మోడీ వైపు చూస్తోందని ఆయన అన్నారు.
వివాదాస్పదమైన భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెసు బుధవారంనాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసింది. జమీన్ వాపసీ ఆందోళన్‌ను ఉధృతం చేస్తామని అంటున్నారు. జమీన్ వాపసీ ఆందోళన్‌లో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు అహ్మద్ పటేల్, ప్రధాన కార్యదర్శులు దిగ్విజయ్ సింగ్, మధుసూదన్ మిస్త్రీ, అజయ్ మాకెన్, మాజీ మంత్రులు జైరాం రమేష్, సల్మాన్ ఖుర్జీద్, జితేందర్ సింగ్, తదితరలు పాల్గొంటారు.












Click it and Unblock the Notifications