సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై వేణుస్వామి సంచలన జోస్యం..! వందకు కోటి శాతం అక్టోబర్ 31లోపు..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విధానంలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న నివేదికలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రానున్న ఒకట్రెండు వారాల్లో పార్లమెంటులో అభిశంసన తీర్మానం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అటు కాక్రోచ్ జనతా పార్టీ సైతం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రెండు రోజుల్లో రాజీనామా చేయాలని లేదంటే సీజేపీ ఉద్యమం మరోసారి ప్రారంభిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో జ్ఞానేశ్ కుమార్ జాతకంపై ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అంశంపై చర్చ జరుగుతోందని అన్నారు. ఈ మేరకు ఆయన జాతకంలో కీలక పరిణామాలు కనిపిస్తున్నాయని వివరించారు. 2026 అక్టోబర్ 31 తర్వాత గ్రహాల మార్పులతో ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జోస్యం వెల్లడించారు. సీఈసీపై వేణు స్వామి వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 1964 జనవరి 27న అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో జన్మించారని.. ఆయనది ఆరుద్ర నక్షత్రం మూడో పాదం, మిథున రాశి, వృశ్చిక లగ్నం అని వెల్లడించారు. జ్ఞానేశ్ కుమార్ జాతకంలో ప్రస్తుతం కేతు మహాదశ నడుస్తోందని వివరించారు.

అయితే 2026 అక్టోబర్ 31 నుంచి గురు సంచారంలో మార్పు ఉంటుందని.. అదే విధంగా రాహు, కేతువుల గోచార మార్పు కూడా ఉంటుందని వేణుస్వామి అంచనా వేశారు. ఈ గ్రహాల పరిణామాలతో రానున్న రోజుల్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని వివరించారు. అంతేకాక ఆయన జాతకంలో కారాగార దోషం కూడా కనిపిస్తోందని 2030లోపు ఆయన జైలుకు కూడా వెళ్లే అవకాశం ఉందని వేణు స్వామి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వేణుస్వామి వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications
