Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్?

త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే.. ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరి పోరు సాగిస్తోన్నాయి.

ఈ పరిణామాల మధ్య మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కొత్త పార్టీ పేరును ప్రకటించారు. దీనికి ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం (AIPTMMK) పేరును ఖరారు చేశారు. ఈ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. కొబ్బరి చెట్ల పొలాన్ని పార్టీ అధికారిక చిహ్నంగా ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై, ఎమ్‌జీఆర్, జయలలిత ఫొటోలను ముద్రించివున్న పతాకాన్ని విడుదల చేశారు.

Vijay Reportedly weighs NDA tie as BJP negotiates 80 seats and Deputy CM role for TVK in Tamil Nadu polls

దీంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. టీవీకేతో సంప్రదింపులు ముమ్మరం చేసింది. బీజేపీ- టీవీకే చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీవీకేకు ముందు పలు ప్రతిపాదనలు ఉంచిందనే ప్రచారం జరుగుతోంది. భారీ ఆఫర్లను అందించడానికి సైతం బీజేపీ అధిష్ఠానం అంగీకరించినట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- బీజేపీ కూటమి గెలిస్తే విజయ్‌కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో పాటు- టీవీకేకు సుమారు 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై టీవీకే ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయాలను తీసుకోలేదని అంటున్నారు.

ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే తమిళనాడులో రాజకీయ, ఎన్నికల సమీకరణాలను గణనీయంగా మారిపోతాయనే అబిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవికి బదులుగా విజయ్ ముఖ్యమంత్రి హోదాను ఆశిస్తోన్నారని, అదే ఈ చర్చల్లో కీలక అంశంగా కొనసాగుతోందనే వాదనలు లేకపోలేదు.

విజయ్‌, ఆయన పార్టీని ఎన్‌డీఏ గొడుగు కిందకు తీసుకురావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. క్రియాశీల రాజకీయాల్లోకి విజయ్ ప్రవేశించినప్పటి నుంచీ ఆయనపై ఓ కన్ను వేసి ఉంచింది. విజయ్ కు కోట్లాదిమంది అబిమానులు ఉండటం వల్ల టీవీకే చాలా తక్కువకాలంలో ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందని, దాన్ని ఓటుబ్యాంకుగా మలచుకోవాలనేది బీజేపీ ప్రయత్నం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+