ఎన్నికల వేళ.. విజయ్ కు సీబీఐ బిగ్ షాక్..!
కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సీబీఐ విచారణ ముగిసింది. విజయ్ ను సీబీఐ అధికారులు సుమారు 6 గంటలపాటు ప్రశ్నించారు. ఇవాళ అనుమానితుడిగా సీబీఐ ప్రశ్నించింది. అలాగే మొన్న సాక్షిగా ప్రశ్నించింది. ఈ మేరకు ఫిబ్రవరి రెండో వారంలో విజయ్ పేరుతో ఛార్జిషీట్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని కరూర్ కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ పేరును చేర్చనున్నట్లు సమాచారం అందుతోంది. తాజాగా విజయ్ సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ అధికారులు సుమారు 6 గంటలపాటు విజయ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు ఫిబ్రవరి రెండో వారంలో విజయ్ పేరుతో ఛార్జిషీట్ వేసే అవకాశం ఉంది. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ సీబీఐ విచారణకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
కరూర్ తొక్కిసలాట కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్నవారందరినీ దిల్లీలో ఉన్న కార్యాలయానికి రప్పించి ప్రశ్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 12 న విజయ్ ను సీబీఐ అధికారులు సుమారు ఆరు గంటలపాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కరూర్ తొక్కిసలాట ఘటనతో టీవీకే పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినా మరోసారి హాజరు కావాలని చెప్పడంతో డిసెంబర్ 19న దిల్లీ సీబీఐ కార్యాలయానికి వచ్చారు.

ఇక ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో విజయ్ సీబీఐ విచారణకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్ ఈ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా అది వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ సినిమాపై వివాదం నడుస్తోంది.












Click it and Unblock the Notifications