ఆక్రమణల తొలగింపుతో చెలరేగిన అల్లర్లు: పోలీసులకు గాయాలు, కనిపిస్తే కాల్చివేత ఆర్డర్

హల్ద్వానీ: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హల్ద్వానీలో ఆక్రమణల తొలగింపు ప్రచారం సందర్భంగా చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగామారాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేత తర్వాత హల్ద్వానీలో తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు రాళ్లదాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి

ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కనపడితే కాల్చమని ఆదేశాలు కూడా జారీ చేశారు. హల్ద్వానీలోని మలికా బాగీచాలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదుపై అదికారుల బుల్డోజర్ చర్య తర్వాత అల్లర్లు చెలరేగాయి. అక్కడ ఆందోళకారులు మొదట రాళ్లు రువ్వి, ఆపై వాహనాల దహనం ప్రారంభించారు. ఈ గొడవలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు అదనపు పోలీసు బలగాలను రప్పించారు. అంతేగాక, దుండగులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు టియర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించారు.

violence after removal of encroachment campaign in haldwani, Uttarakhand

సమాచారం ప్రకారం, హల్ద్వానీలోని బంబుల్‌పురాలో ఆక్రమణల తొలగింపు ప్రచారం తర్వాత హింస చెలరేగింది. డీఎం నైనిటాల్ బంబుల్‌పురాలో కర్ఫ్యూ విధించారు. అల్లరిమూకలను కనిపించగానే కాల్చివేయాలని ఆదేశించారు. ఈ కర్ఫ్యూ ఆర్డర్ హల్ద్వానీ పట్టణ ప్రాంతంలో ఈ రాత్రి 9 గంటలకు అమలులోకి వచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉంటుంది.

తాజా సమాచారం ప్రకారం.. హింసాకాండ ప్రభావిత ప్రాంతమైన హల్ద్వానీకి 4 కంపెనీల పారామిలటరీ బలగాలను పంపినట్లు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అధికార ప్రతినిధి ఐజీ నీలేష్ ఆనంద్ భరణే తెలిపారు. ఉధమ్ సింగ్ నగర్ నుంచి 2 పీఏసీ కంపెనీలు హల్ద్వానీకి చేరుకున్నాయని ఐజీ తెలిపారు.

సీఎం ధామి ప్రకటన

ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. 'కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేషన్‌ బృందం అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లింది. పోలీసులు, అరాచక శక్తుల మధ్య ఘర్షణ జరిగింది. పలువురు పోలీసులు గాయపడ్డారు అని తెలిపారు. పోలీసులు, ఇతర కేంద్ర బలగాలను వెంటనే అక్కడికి పంపుతున్నారు. అందరూ శాంతిభద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, ఉత్తరాఖండ్‌ డీజీపీ అభినవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జిల్లా యంత్రాంగం, పోలీసుల సంయుక్త బృందం కోర్టు ఆదేశాల మేరకు హల్ద్వానీలోని బంబుల్‌పురాలో అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కొందరు ఆందోళకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతోపాటు వాహనాలకు నిప్పు పెట్టడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. పలువురు పోలీసులను గాయపర్చారని తెలిపారు.

పోలీస్ స్టేషన్ చుట్టూ విధ్వంసం, దహనం గురించి కూడా సమాచారం ఉంది. సమాచారం అందిన వెంటనే డీఐజీ కుమాన్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని, సమీప జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను కూడా అక్కడికి రప్పించామని తెలిపారు. ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి తన నివాసంలో అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. గాయపడిన పోలీసు సిబ్బంది, పరిపాలన సిబ్బందిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు.

పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది కానీ అదుపులో ఉంది. మొత్తం సంఘటన సీసీటీవీ ఫుటేజీ మా వద్ద ఉంది. రానున్న రోజుల్లో ఈ ఘటన వెనుక ఉన్న అసాంఘిక శక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డీజీపీ. కాగా, హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్థానికంగా అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+