తమిళనాడులో అనూహ్యంగా పావులు కదిపిన ప్రధాని మోదీ- ప్రచారం చివరిరోజు
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తమిళనాడులో ప్రచారం హోరెత్తుతోంది. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు తప్పకపోవచ్చు.
ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన రూపురేఖలపై వాదోపవాదాలు సాగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారంలో ఉన్న సభ క్లిప్‌లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని మోదీ సాధారణం కంటే చామనఛాయగా కనిపించడం దీనికి ప్రధాన కారణం. తమిళనాడు ఓటర్లను ఆకట్టుకునేందుకు డార్కర్ టోన్ మేకప్ లేదా బ్రాంజర్ వాడారని నెటిజన్లు చెబుతున్నారు. ఈ వాదనలకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదా విశ్వసనీయ ఆధారాలు లేవు.

తమిళనాడు ప్రజల స్కిన్ టోన్ చామనఛాయలో ఉంటుందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన డార్కర్ టోన్ మేకప్ లేదా బ్రాంజర్ ద్వారా తన మేని వర్ణాన్ని ఇలా చామనఛాయలోకి మార్చుకున్నారనే వాదన తలెత్తింది. దీనిపై భిన్న స్పందనలు వ్యక్తమౌతోన్నాయి. ప్రధాని మోదీ ఈ రూపాన్ని కొందరు నెటిజన్లు "తమిళనాడు మేకోవర్" అని చెబుతున్నారు. మరికొందరు దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. గతంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ పొడవాటి గెడ్డం పెంచుకుని, రబీంద్రనాథ్ ఠాగూర్ లా కనిపించడానికి ప్రయత్నించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తోన్నారు.
DARK MAKEUP FOR DARKER VOTES — Tamil Nadu Tantrum!” 😡🎭 ⁉️
— 🥇 Pragnya Gupta (@GuptaPragnya) April 20, 2026
Everything is a PR stunt for our PM.
In Tamil Nadu, he seems to have applied darker skin-tone makeup to “look like one among them.
Does he really think all Tamilians are black or dark?
If this is true then this is… https://t.co/b8oGXWAZgA
మెజారిటీ సోషల్ మీడియా యూజర్లు ఈ వాదనలను తోసిపుచ్చారు. రూపురేఖలలో కనిపించిన ఈ భేదం.. లైటింగ్ తేడాలు, తీవ్ర సూర్యరశ్మి, కెమెరా ఎక్స్‌పోజర్ లేదా పోస్ట్ ప్రాసెసింగ్ ప్రభావాల వల్ల వచ్చి ఉండవచ్చని వాదించారు. బహిరంగ సభల్లో పాల్గొంటోండటం, తమిళనాడులో ఎండ తీవ్రత, అక్కడి వాతావరణం ప్రధాని మోదీ చర్మపు రంగును చామనఛాయలోకి మార్చి ఉంటాయని అంటున్నారు. కెమెరా కోణాలు, పరికరాలను బట్టి కూడా స్కిన్ టోన్ మారుతుంటుందని విజువల్ మీడియా నిపుణులు వివరించారు.
Prime Minister Modi has sunk so low in his bid to win elections that he is now campaigning in Tamil Nadu wearing dark skin makeup.
— BanterBallHQ (@BanterBallHQ) April 20, 2026
Is this not racist? Is this not an insult to the people of Tamil Nadu?
How far is too far for the sake of winning an election?
Your thoughts? pic.twitter.com/lKjfzr95ij
అయినప్పటికీ ఈ డిబేట్ తీవ్రరూపం దాల్చింది. సోషల్ మీడియా యూజర్లు దీన్ని ఉత్తరాది-దక్షిణాదిగా విభజించి మరీ చూస్తోన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో తలెత్తిన ఈ వాదనలు అక్కడి తీవ్రతను తెలియజేస్తోన్నాయి. మైక్రో లెవెల్ విజువల్స్ లో కనిపించే తేడాలు కూడా విస్తృత చర్చ, ఊహాగానాలకు దారి తీశాయి. వాస్తవానికి- వ్యాఖ్యానానికి మధ్య ఉన్న గీతను తరచుగా మసకబారేలా చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications