వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:బావిలో చిరుత.. పురాతన టెక్నిక్‌తో తీసి.. వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

అవసరం లేని, ఉపయోగించని బోరు బావులను మూసివేయాలి. లేదంటే పడి చిన్నారులు చనిపోయిన ఘటనలు చూశాం. అలాగే పురాతన బావులు.. అదే ఉపయోగించని బావులను కూడా పూడ్చాలి.. లేదంటే కప్పాలి. అందులో పిల్లలు, పెద్దలే కాదు జంతువులు కూడా పడేందుకు ఆస్కారం ఉంది. ఇటీవల అలా ఓ చిరుతపులి బావిలో పడింది. అదీ చాలా లోతు ఉండటం.. దానిని కాపాడేందుకు అధికారులు పురాతన పద్దతి అవలంభించారు. దానికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది.

పురాతన టెక్నిక్

ఇదీ ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ బావిలో చిరుత పడింది. దానిని హరప్ప మొహంజొదారో టెక్నిక్ ఉపయోగించి బయటకు తీశారు. ఒక ఇనుప మంచం ఉల్లా పెట్టి.. దానికి నాలుగు వైపులా తాడు కట్టారు. అవీ చాలా పెద్దగా పెట్టి కిందకు దించారు. ఆ మంచం కిందకి వెళ్లగా.. చిరుతపులి దానిపై కూర్చొంది. దానిని గమనించి మెల్లగా పైకి లాగారు. అదీ అలా బయటకు వచ్చింది. పైకి వస్తూ.. వస్తూనే బయటకు వెళ్లిపోయింది. అదీ ఎవరికీ హానీ చేయకుండా వెళ్లడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

43 వేల సార్లు

43 వేల సార్లు

వీడియో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటికే 43 వేల సార్లు చూశారు. చాలా మంది కామెంట్ చేశారు. ఇప్పటికైనా బావులను తెరవకండి అని కోరారు. దీంతో పిల్లలే కాదు.. మృగాలు కూడా అందులో పడుతున్నాయని పేర్కొంది. సమస్య గురించి పర్యావరణ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని ఒకరు సూచించారు. చిరుత ఎవరికీ హానీ కలిగించకుండా వెళ్లిపోయిందని మరొకరు అన్నారు. వృత్తిపరంగా సంతృప్తి కలిగించిందని మరొకరు కామెంట్ చేశారు. ఈ నెలలో ఒడిశా సంబల్‌పూర్ జిల్లాలో కూడా ఓ చిరుతపులిని కాపాడారు. అదీ కూడా బావిలో పడగా కాపాడారు. అప్పుడు అగ్నిమాపక శాఖ సహాయక చర్యలను చేపట్టింది.

సక్సెస్ ఫుల్

సక్సెస్ ఫుల్


చిరుతపులిని పురాతన టెక్నాలజీ ఉపయోగించి కాపాడారు. హరప్ప మొహంజదారో పద్దతి అనుసరించారు. అదీ కూడా విజయవంతం అయ్యింది. చిరుతపులి సక్సెస్ పుల్‌గా బయటకు వచ్చింది. నెటిజన్లు వావ్ అంటూ ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో వాడని బావులను మూసివేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

English summary
showing the rescue of a leopard to draw attention to the issue of open wells around animal habitats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X