Viral Video: వామ్మో.. ఇది ఆటోనా లేక బస్సా.. ఏకంగా 27 మంది.. వైరల్ అవుతున్న వీడియో..
సాధారణంగా ఆటోలో ఎంత మంది పడతారు. నలుగురు.. మరి ఎక్కువంటే ఆరుగురు.. ఇంకా ఎక్కువంటే ఎనిమిది మంది..కానీ ఓ ఆటలో ఏకంగా 27 మంది ఎక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలీసు అటుగా వెళ్తున్న ఆటో0ను ఆపాడు.. అయితే ఆటోలో డ్రైవర్ తో పాటు 27 మంది ప్రయాణికులను చూసి కంగుతిన్నాడు. పోలీసులు ప్రయాణికులను ఒక్కొక్కరిగా లెక్కిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆటో సీజ్
ఫతేపూర్‌లోని బింద్‌కీ కొత్వాలి ప్రాంతంలో వాహనాల తనిఖీల్లో భాగంగా ఓ పోలీసు ఆటో దాన్ని తనిఖీ చేశారని స్థానిక మీడియా తెలిపింది. అయితే ఆ ఆటో మితిమీరిన వేగంతో వెళ్తునందుకు ఆపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ప్రయాణికులను కిందకు రమ్మని కోరగా, అందులో నుంచి రెండు డజన్ల మందికి పైగా దిగడం చూసి వారు ఆశ్చర్యపోయారు. దీంతో ఆటోను సీజ్ చేశారు. పరిమితికి మించి వాహనంలో ఎక్కించుకోవద్దని చెబుతున్నారు.

భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నువ్వు గొప్పొడివి అంటూ డ్రైవర్ ను కిర్తీస్తున్నారు. ఇంత మందితో వెళ్తున్న ఆటోకు ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల క్రితం ఓ ఆటో డ్రైవర్ ఆటో పైకప్పుపై మొక్కలు ఉంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వినూత్న ఆలోచన
డ్రైవరు మహేంద్ర కుమార్ వేసివిలో ఎండవేడిమి సమయంలో తనను, తన ప్రయాణీకులను చల్లగా ఉంచడానికి ఈ సృజనాత్మక ఆలోచనతో ముందుకు వచ్చాడు. కుమార్ తన ఆటో పైకప్పుపై 20 రకాల మూలికలు, కూరగాయలు, మొక్కలను పెంచాడు.. అతను ఒక రకమైన తోటలో పాలకూర, టమోటా మరియు మిల్లెట్ వంటి పంటలను కూడా పండించాడు.












Click it and Unblock the Notifications