వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా: విశ్వజిత్ రాణే లీడ్, భార్య కూడా.. పోలింగ్ కేంద్రం నుంచి వస్తూ ఆనందం, సీఎం అంటూ..

|
Google Oneindia TeluguNews

5 రాష్ట్రాల ఎన్నికల్లో కమలం వికసించింది. ఒక పంజాబ్ మినహా మిగతా చోట్ల బీజేపీ ప్రభుత్వాలే కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత, మంత్రి విశ్వజిత్ రాణే వాలిపొయి నియోజకవర్గంలో గల పోలింగ్ స్టేషన్ సందర్శించారు. ఎర్లీ ట్రెండ్ చూసి అతను సంభ్రమశ్చర్యాలకు గురయ్యారు. అతను చూసే సమయానికి 7 వేల ఓట్ల లీడ్‌లో ఉన్నారు. అక్కడినుంచి ఆనందభాష్పాలతో వెనుదిరిగారు.

అభ్యర్థుల విజయం కానీ, తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రధాని మోడీ కారణం అని చెప్పారు. గోవా కోసం మోడీ ఎంతో చేశారని పేర్కొన్నారు. ఇదీ ప్రజల విజయం అని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పనిచేసింది.. పనిచేస్తోందని వివరించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు అయితే ప్రజలను మోసం చేశాయని తెలిపారు. పోలింగ్ కేంద్రం నుంచి వెళుతూ మీడియాతో మాట్లాడుతుండగా.. అతనిని సీఎం చేయాలని మద్దతుదారులు నినాదాలు చేశారు. ఇదీ ప్రాధాన్యం సంతరించుకుంది. గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మనోహర్ పారికర్ మరణం తర్వాత.. సావంత్ పగ్గాలు చేపట్టారు.

Vishwajit Rane Of Goa BJP Breaks Down, Wife also Leading

మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం పనిచేసిందని రాణే వివరించారు. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల సదుపాయాల కల్పన చేపట్టిందని తెలిపారు. అలాగే అతని భార్య ప్రాతినిధ్యం వహిస్తోన్న పొరియం నియోజకవర్గం ట్రెండ్స్ గురించి సహచరులు తెలియజేశారు. ఆమె 13 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

గోవాలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. 17 చోట్ల బీజేపీలో లీడ్‌లో ఉంది. మరో 4 సీట్లలో లీడ్ కొనసాగితే.. బీజేపీ అధికారం ఖాయం. కాంగ్రెస్ పార్టీ 11 చోట్ల లీడ్‌లో ఉంది.

English summary
goa minister Vishwajit Rane was seen crying in joy as he left a polling station in Valpoi segment, where is leading with a margin of over 7,000 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X