ఆప్ బలంగా ఉన్న చోట.. సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్

పంజాబ్ పోలింగ్ ముగిసింది. గతంలో కన్నా తక్కువే నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 65.32 అని ప్రకటించారు. కానీ తర్వాత అదీ 69.65 శాతానికి చేరింది. ఎవరైనా క్యూ లైన్‌లో ఉన్నవారు ఓటు వేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు 2007 తర్వాత ఇదే తక్కువ ఓటింగ్ శాతం.. 2017లో కూడా భారీగానే పోలింగ్ జరిగింది.

ఈ సారి పోలింగ్ తక్కువ జరగడంలో ఏదో మతలబు ఉందనే సందేహాం కలుగుతుంది. ఆప్‌ బలంగా ఉన్న చోట మాత్రం పోలింగ్ శాతం తగ్గింది. ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట 2.3 శాతం నుంచి 9 శాతం వరకు పోలింగ్ తక్కువగా నమోదు అయ్యింది. తల్వాండి సాబొలో 83.70 శాతం నుంచి 86 శాతం పోలింగ్ జరిగింది. అంటే 2.3 శాతం పోలింగ్ తక్కువ వచ్చింది. కోక్టపురలో 4 శాతం, దిర్బాలో 4.4 శాతం, సునమ్‌లో 5.4 శాతం, బార్నాలాలో 6.6 శాతం, బుదాల్దాలో 6.2 శాతం, మెహల్ కలాన్ 9.4 శాతం, జగరన్‌లో 9.8 శాతం తగ్గింది.

Voting Figures In Punjab Erratic, Big Drop In Areas That Chose AAP

రాష్ట్రంలో 2002లో 65.14 శాతం పోలింగ్ జరగగా.. 2007లో 75.42 శాతం జరిగింది. 2012లో 78.3 శాతం.. 2017లో 77.36 శాతం పోలింగ్ వచ్చింది. అమృత్ సర్ పశ్చిమలో తక్కవగా 55.40 శాతం.. గిద్దర్ బహలో 84.93 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 2007 తర్వాత తక్కువ పోలింగ్ ఇప్పుడే నమోదైంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అధికారం చేతులు మారింది. అకాలి, బీజేపీ అధికారం చేపట్టింది. 2017లో అకాళి-బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చరమగీతం పాడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+