ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో పోలింగ్ షురూ: డిసైడింగ్ ఫ్యాక్టర్స్..!!
ఛత్తీస్‌గఢ్/మిజోరం అసెంబ్లీ ఎన్నికలు: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. అధికార పార్టీని ఎన్నుకుంటోన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ, మిజోరంలో ఒకే విడతలో ఈ పోలింగ్ పూర్తవుతుంది.
ఈ రెండు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మూడు రాష్ట్రాల్లో ఈ నెల 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది. ఛత్తీస్‌గఢ్ రెండో విడత పోలింగ్ కూడా అదే రోజున షెడ్యూల్ అయింది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటోన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్‌ను నిర్వహించింది.
మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ 20 నియోజకవర్గాలు కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉండటమే దీనికి కారణం. మొత్తం 40 లక్షలమందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 5,304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున భద్రత బలగాలను మోహరించారు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. పారా మిలటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్రీయ రిజర్వ్ పోలీస్ దళాలను రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు.
40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో ఒకే విడతలో పోలింగ్ ముగుస్తుంది. ఎనిమిది లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వారికోసం 1,276 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పారు అధికారులు. ముఖ్యమంత్రి జోరమ్ థంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజధాని ఐజ్వాల్ నార్త్-2 నియోజకవర్గంలోని వైఎంఏ హాల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఆయా పార్టీలు తమ అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేదా? అనేది డిసైడ్ చేసే ఎన్నికలు ఇవి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, మిజోరంలో జోరం పీపుల్స్ మూమెంట్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంటోన్నాయి. ఆయా పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.












Click it and Unblock the Notifications