అధికారం దక్కేదెవరికి - నేడే కీలక ఘట్టం..!!
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
2024 ఎన్నికల ముందు సెమీస్ పోరు ప్రారంభమైంది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకోసం 3,337 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 1,100 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా, 28 బూత్‌లను క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు సీఈఓ వెల్లిడించారు. 31,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది, 25,000 మంది కేంద్ర భద్రతా సిబ్బందితో పాటు 31,000 మంది రాష్ట్ర సాయుధ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం మోహరించారు. రాష్ట్రంలో 28.13 లక్షల ఓటర్లుండగా, అందులో మహిళలు 13.53 లక్షలు. 259 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 20 మంది మహిళలున్నారు.
త్రిపురలో అధికార బీజేపీ 55 సీట్లలో పోటీలో ఉండగా, దాని మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ కేవలం ఐదు సీట్లలో మాత్రమే బరిలో ఉంది. వామపక్ష కూటమిలో సీపీఎం 47 సీట్లలో, కాంగ్రెస్ 13 సీట్లలో పోటీపడుతున్నాయి. తిప్ర మోత 42 మంది అభ్యర్థులను రంగంలో ఉంచారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాలలో, స్వతంత్ర అభ్యర్థులు 42 మంది పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు మార్చి 2న జరుగుతుంది. ముందుజాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా నిషేధ ఆజ్ఞలు ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలకు బయట నుంచి ఎవరూ ప్రయత్నించకుండా చూసేందుకు అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర సరిహద్దులను సీజ్ చేశారు. ముఖ్యమంత్రి మాణిక్ సహా బీజేపీ అభ్యర్థిగా బార్డోవలి టౌన్ నుంచి, కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ బీజేపీ టిక్కెట్‌పై ధన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా సబ్రూమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్‌టీ ఆరు నియోజకవర్గల్లో ఆరు నియోజకవర్గాల్లో పోటీలో ఉంది. సీపీఏం 47 స్థానాల్లోనూ, దాని భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ 13 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నారు. త్రిపుర రాజవంశీయుడు ప్రద్యోత్ మాణిక్య దేబ్ బర్మ నూతనంగా ఏర్పాటు చేసిన తిప్ర మోతా పార్టీ 42 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 28 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టగా, 58 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. బీజేపీ అత్యధికంగా 12 మంది మహిళలకు సీట్లు ఇచ్చింది. గ్రేటర్ తిప్ర ల్యాండ్ స్టేట్‌హుడ్ డిమాండ్‌పై తిప్ర మోతా పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇక్కడ టీఎంసీ వైపు ప్రజలు ఏ స్థాయిలో మొగ్గు చూపుతున్నారనేది ఆసక్త కరంగా మారుతోంది. ఓటర్ల తీర్పు ఏంటనేది మార్చి 2న వెల్లడి కానుంది.












Click it and Unblock the Notifications