చారిత్రక ఘట్టం: జమ్ము కాశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం!!

జమ్ము అండ్ కశ్మీర్ పునర్విభజన బిల్లు రాజ్యసభ అమోదం పోందింది. ఉదయం పునర్విభజనపై కేంద్ర హూంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో సాయంత్రం బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. రీ ఆర్గనైజెషన్‌ బిల్లుపై ముందుగా మూజువాణి ఓటుతో పాస్ చేయాలని భావించిన సభ్యులు డివిజన్ ప్రకారం ఓటింగ్ నిర్వహించాలని కోరారు. అయితే ఓటింగ్‌ను ఎలక్ట్రానిక్ పద్దతితో నిర్వహించాలని బావించారు. కాని సాంకేతిక సమస్యలతో దాన్ని విరమించుకున్నారు. దీంతో స్లిప్‌ల ద్వార ఓటింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పునర్వీభజన బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 61 మంది ఓట్లు వేశారు. ఇక బిల్లును ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం సులభంగా నెగ్గనుంది.అంతకు ముందు సమారు గంటపాటు హోంమంత్రి అమిత్ షా సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

రాజ్యసభలో చాకచక్యంగా వ్వవహరించిన కేంద్రం

రాజ్యసభలో చాకచక్యంగా వ్వవహరించిన కేంద్రం

అనేక అందోళన మధ్య జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం లభించింది. అనేక అనుమాల మధ్య బిల్లును ప్రేవేశ పెట్టిన కేంద్రం అంతే స్పీడుగా అమోదం చేయించుకుంది. ప్రతిపక్షాల వ్యూహాలకు అర్థం కాకుండా రాజకీయ వ్యూహాన్ని నెరవేర్చిన మోడీ ప్రభుత్వం అంత్యంత సున్నితమైన కశ్మీర్ విభజన బిల్లును తమకు రాజ్యసభలో పూర్తి స్థాయి బలం లేకున్నా అంత్యంత చాకచక్యంగా పాస్ చేయించుకుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఉంటే బీఎస్పీ, ఆప్‌తోపాటు తెలుగు రాష్ట్రాల పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ తదితర విపక్ష పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు పలికాయి. అయితే, ఈ విషయంలో బీజేపీ మిత్రపక్షం జేడీయూ కేంద్రానికి షాకిచ్చి వ్యతిరేకంగా ఓటు వేసింది.

లోక్‌సభలో సులభంగా పాస్‌ కానున్న పునర్విభజన బిల్లు

లోక్‌సభలో సులభంగా పాస్‌ కానున్న పునర్విభజన బిల్లు

ఆర్టికల్ 370 రద్దు కావడంతో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించాలి. ఇందులో భాగంగానే రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా రాజ్యసభలో నెగ్గించుకుంది. ఇక ఇప్పటికే లోక్‌సభలో బిల్లును ప్రవేశ పెట్టిన ప్రభుత్వం మంగళవారం దానిపై చర్చను కోనసాగించనుంది. అనంతరం బీజేపీకి పూర్తి మెజారిటి ఉండడంతో లోక్‌సభలో కూడ చాల సులభంగా కశ్మీర్ పునర్విభజన బిల్లు పాస్ కానుంది.

ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందితే వచ్చే మార్పులు

ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందితే వచ్చే మార్పులు

జమ్ము కశ్మీర్ ‌లో ఇంతకు ముందు 'శాశ్వత నివాసి'గా రాష్ట్రంలో ఉన్నవారు మాత్రమే ఆస్తులు కొనుగోలు చేయగలిగేవారు. ఇప్పుడు ఎవరైనా అక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు. వీరితో పాటు శాశ్వత ఉద్యోగాల్లో రాష్ట్రేతరులను నియమించనున్నారు. కాగా ఇంతకు ముందు ఆ అవకాశం లేకుండా ఉండేది. ఇంతకు ముందు ఇక్కడ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి అదుపులో ఉండేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రతినిధి అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇవి నేరుగా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయి.కేంద్రం రూపొందించే చట్టాలన్నింటినీ ఇంతకు ముందు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాల్సి వచ్చేది. ఇప్పుడు అవి కేంద్రం నిర్ణయించినట్టు రాష్ట్ర అసెంబ్లీ అమోదం లేకున్నా అమల్లోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+