భయం గుప్పిట్లో పాకిస్థాన్.. పౌరులకు రేషన్ పై కీలక ఆదేశాలు!
పహల్గామ్ లో అమాయక టూరిస్టులపైన ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్, పాకిస్థాన్ ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం తెలిసిందే. పహల్గామ్ దాడి తర్వాత దీనికి గట్టి సమాధానం చెప్పాలని భారత్ సిద్ధమవుతోంది. సైనిక చర్యకు దిగాలని భావిస్తోంది. ఇక ఈ క్రమంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న భారత్ పాకిస్తాన్ ని ఉక్కిరిబిక్కిరి చేసే పనిలో పడింది.
యుద్ధానికి సిద్ధమవుతూనే ప్రజలకు ఆదేశం
పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎల్వోసీ దగ్గర పాక్ బలగాలు పదేపదే కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. కుప్వారా, బారాముల్లా, పూంచ్, అక్నూర్, నౌషేరా సెక్టార్ లలో పాత బలగాల కవ్వింపు చర్యలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతుంది. భారత్ తో యుద్ధ భయంలో ఉన్న పాకిస్థాన్ ఓవైపు తన బలగాలను సిద్ధం చేసుకుంటూనే మరోవైపు ప్రజలకు కూడా కీలక సూచనలు చేస్తుంది.

పాక్ పౌరులకు సూచన
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ దాడి చేస్తుంది అన్న భయంతో పాకిస్థాన్ పౌరులకు సైనిక శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బంకర్ లను సిద్ధం చేస్తున్నారు. ఏ సమయంలోనైనా భారత్ దాడి చేసే అవకాశం ఉందని అక్కడి స్థానికులకు రెండు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు, మందులు సిద్ధం చేసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం సూచించింది.
మదర్సాలపై దాడి చేస్తారని ఆందోళన
అంతేకాదు యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండాలని అక్కడ పౌరులకు తెలియజేసింది .పాక్ ఆక్రమిత కాశ్మీర్లో రిజర్వు బలగాలను కూడా రంగంలోకి దించింది పాకిస్థాన్. మరోవైపు ఉగ్రవాద శిక్షణ శిబిరాలకు నిలయంగా మారిన మదర్సాల పైన భారత్ టార్గెట్ చేస్తుందని అనుమానిస్తుంది పాకిస్థాన్.
వారికి ఆయుధ శిక్షణ
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వెయ్యి మదర్సాలను పది రోజులపాటు మూసేసింది. పీఓకే లో పిల్లలకు సైతం పాకిస్థాన్ ఆయుధ శిక్షణను ఇస్తోంది. ఇది ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ భయం గుప్పిట్లో ఉన్న పాకిస్థాన్ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ పీఓకే లోని తమ పౌరులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications