వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెడ్ కానిస్టేబుల్‌ మరణానికి దారి తీసిన మూకదాడి: వైరల్ వీడియో..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో హెడ్ కానిస్టేబుల్ మూకదాడికి గురైన సంఘటనకు సంబంధించిన వీడియో సంచలనం రేపుతోంది. ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (షాదారా), అమిత్ శర్మ, గోకుల్‌పురి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనూజ్, హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్‌పై ఆందోళనకారులు మూకదాడులకు పాల్పడిన సందర్భంలో చిత్రీకరించిన వీడియో ఇది. ఈ దాడి ఘటనలో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ సంఘటనా స్థలంలోనే మరణించగా.. అమిత్ శర్మ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు.

అర్ధరాత్రి పబ్‌లో..మద్యం మత్తులో..బీరు సీసాలతో ఘర్షణ: రాహుల్ సిప్లిగంజ్‌కు గాయాలు..!అర్ధరాత్రి పబ్‌లో..మద్యం మత్తులో..బీరు సీసాలతో ఘర్షణ: రాహుల్ సిప్లిగంజ్‌కు గాయాలు..!

తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు కపిల్ మిశ్రా ఈ వీడియోను విడుదల చేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీన్ని పోస్ట్ చేశారు. అమిత్ శర్మ, అనూజ్, రతన్ లాల్‌ను ఆందోళనకారులు రాళ్లతో దాడి చేస్తోన్న దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయి ఉన్నాయి. ఆందోళనకారులు అత్యంత అమానవీయంగా ముగ్గురు పోలీసులపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డారని కపిల్ మిశ్రా విమర్శించారు.

Watch rioters lynched Head Constable Ratan Lal

ఆందోళనకారులను ఆయన జోంబీగా అభివర్ణంచారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ప్రదర్శనల సందర్భంగా ఆందోళనకారులు చేసిన దాడుల్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు పోగొట్టుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ గానీ, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు గానీ సమర్థించగలరా? అని కపిల్ మిశ్రా నిలదీశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులపైనా ప్రాణాంతక దాడులకు పాల్పడితే.. ఇక సాధారణ పౌరుల భద్రత మాటేమిటని ప్రశ్నించారు.

ప్రజలందరికీ భద్రతను కల్పించాలనే సదుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు. జాతీయ జనాభా రిజిస్టర్‌ చట్టాలను అమలులోకి తీసుకుని రానుందని, దీనికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని ఆయన కోరారు. సంప్రదాయబద్ధంగా, శతాబ్దాల నుంచీ భారత్‌లో నివసిస్తోన్న ముస్లింలకు ఎలాంటి ఢోకా ఉండబోదని అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌ల నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన వారి కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారు.

English summary
It is alleged that a head constable with the Delhi Police Ratan Lal, who had died of grievous head injuries, is a part of this troop. Also, DCP of Shahdara Amit Sharma and ACP of Gokulpuri Anuj were seriously injured in this attack. Meanwhile, BJP leader Kapil Mishra tweeted: " See how Constable Ratanlal was killed, surrounded by stones... The same mob tried to assassinate DCP Amit Sharma... Look at these women and see their bestiality... These are the women and men who performed anti-CAA in Chand Bagh".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X