60 మంది ఎమ్మెల్యేలు, 8 మంది మంత్రులు మాకే మద్దతు: బాంబు పేల్చిన మన్నార్ గుడి !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు త్వరలోనే సినిమా చూపిస్తామాని, అంత సామాన్యంగా వదిలిపెట్టమని మన్నార్ గుడి మాఫియా హెచ్చరించింది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు త్వరలోనే సినిమా చూపిస్తామాని, అంత సామాన్యంగా వదిలిపెట్టమని మన్నార్ గుడి మాఫియా హెచ్చరించింది. రెండు రోజుల్లో మా వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికీ తెలుస్తోందని మన్నార్ గుడి మాఫియా చెప్పింది.
వీకే శశికళ నటరాజన్ సోదరుడు దివాకరన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ దినకరన్ వైపు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వంలోని 8 మంది మంత్రులు సైతం దినకరన్ కు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.

తమిళనాడు ప్రభుత్వంలో మాకు మద్దతు ఇచ్చే మంత్రుల పేర్లు మాత్రం బయటకు చెప్పమని దివాకరన్ వివరించారు. ఎడప్పాడి పళనిసామి శాసన సభలో బలపరీక్ష నిరూపించుకునే సమయంలో ఆ మంత్రులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వెయ్యడానికి సిద్దంగా ఉన్నారని దివాకరన్ బాంబు పేల్చారు.
శశికళకు అనుకూలంగా మంత్రులు ఎవరెవరు ఉన్నారు అంటూ ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ఆరా తీస్తున్నారు. శశికళకు అనుకూలంగా ముగ్గురు మంత్రులు ఉన్నారు. అయితే మిగిన ఐదు మంది మంత్రులు ఎవరు ? అంటూ ఇప్పుడు తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications