వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ ఎంపీలు ఏమయ్యారు.!జంతర్ మంతర్ లో ధర్నా చేస్తున్న బీసి సంఘాలకు రేవంత్ రెడ్డి మద్దత్తు.!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : జంతర్ మంతర్ లో తెలుగు రాష్ట్రాల బిసి సంఘాల ధర్నాకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ జంగ్ సైరన్ ధర్నా కార్యక్రమం ఢిల్లీలో నిర్వహిస్తున్నారు బీసీ నాయకులు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన బిసి కార్యకర్తలు హాజరయ్యారు.

కేంద్ర బీజేపి బీసిల వ్యతిరేక ప్రభుత్వం.. అందుకే బీసి గణనను వ్యతిరేకిస్తుందన్న రేవంత్ రెడ్డి

కేంద్ర బీజేపి బీసిల వ్యతిరేక ప్రభుత్వం.. అందుకే బీసి గణనను వ్యతిరేకిస్తుందన్న రేవంత్ రెడ్డి

జనగణనలో బిసిలను కులాల వారిగా లెక్క తేల్చాలని డిమాండ్ చూస్తూ బీసీ నేతలు ధర్నా కార్యక్రమానికి ఉపక్రమించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం పై మండి పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రశఖర్ రావు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు బీసీల గురించి మాట్లాడటం లేదని సూటిగా ప్రశ్నించారు. జంతర్ మంతర్లో బీసీ సంఘాల నాయకులు ధర్నా చేస్తుంటే వారికి సంఘీభావం తెలపకుడా తొమ్మిది మంది తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఏం ఉండి కూడా ఏంచేస్తున్నారని రేవంత్ రెడ్డి నిలదీసారు.

జంతర్ మంతర్ లో ధర్నా చేస్తున్న బీసీ నేతలు.. సంఘీభావం ప్రకటించిన రేవంత్ రెడ్డి

జంతర్ మంతర్ లో ధర్నా చేస్తున్న బీసీ నేతలు.. సంఘీభావం ప్రకటించిన రేవంత్ రెడ్డి

అంతే కాకుండా చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారంటే బడుగు బలహీన వర్గాలు ఓట్ల ద్వారానే అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని, బీసీలలో కుల గణాలు లెక్కించడం వల్ల బిసి విద్యార్ధులు ఉద్యోగాలు పొందే హక్కు ఉంటుంది, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో బీసీల కుల లెక్కలు చేపట్టిందని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు.

ప్రధాని బీసీ ఐనప్పటికీ బీసీలకు అన్యాయం.. ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి

ప్రధాని బీసీ ఐనప్పటికీ బీసీలకు అన్యాయం.. ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి

కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడి పోవడం వల్ల పూర్తి స్థాయిలో సాధ్యంకాలేదని మండి పడ్డారు. దేశ ప్రధాన మంత్రి బీసీ ఐనప్పటికీ బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. బడుగు బలహీన వర్గాల మద్దతు లేకుండా బీజేపీ అధికారంలోకి వచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యాక బీసీల గురించి పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ ఎంపీలు ఏమయ్యారు.. బీసీ నేతల దర్నాకు కనీసం మద్దతు ప్రకటించరా అని నిలదీసిన రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలు ఏమయ్యారు.. బీసీ నేతల దర్నాకు కనీసం మద్దతు ప్రకటించరా అని నిలదీసిన రేవంత్

బీసీల లెక్కలు ఎందుకు తీయడం లేదో దేశంలో ఉన్న యావత్ బీసి సోదరులకు చెప్పాల్సిన బాద్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేసారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల జనాభా లెక్క చేపడతామని, బీసీల అంశంపై పార్లమెంటులో పోరాడుతామని రేవంత్ తెలిపారు, బీసీల వెంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉంటుందని రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.

English summary
TPCC President Rewanth Reddy has expressed support for the BCs' dharna of Telugu states in Jantar Mantar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X