అసలు ఏంటి "ఆపరేషన్ మహాదేవ్".. పహల్గాం దాడి మాస్టర్‌మైండ్‌ను ఎలా మట్టుబెట్టారు !
జమ్మూ కాశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు, పోలీసు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ మహాదేవ్' విజయవంతమైంది. ఈ ఆపరేషన్లో పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి అయిన లష్కరే తోయిబా కమాండర్ హషీం మూసాతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు మట్టుబెట్టారు.
పహల్గాం మారణకాండ..
2025 ఏప్రిల్ 22న పహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మృతి చెందారు. ఈ దాడిలో ఉగ్రవాదులు మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా విచక్షణ లేకుండా కాల్పులు జరిపారు. ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళన కలిగించింది. ఈ దాడికి తక్షణ ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది. ఇందులో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK), పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

ఆపరేషన్ మహాదేవ్..
కాగా ఆ తర్వాత ఆపరేషన్ మహాదేవ్ ను కొనసాగించింది ప్రభుత్వం. ఈ ఆపరేషన్‌ను చినార్ కార్ప్స్ సమన్వయంతో 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా స్పెషల్ ఫోర్సెస్ బృందాలు నిర్వహించాయి. గత రెండు వారాలుగా ఉగ్రదాడి జరిపిన ముఠా కోసం భద్రతా దళాలు దాచిగాం నేషనల్ పార్క్ పరిసరాలలో ఇంటెలిజెన్స్ ఆధారంగా గాలింపు చేపట్టాయి. అంతే కాకుండా స్థానిక సంచార జాతుల వారు కూడా ఉగ్రవాదుల కదలిలపై భద్రతా దళాలకు సమాచారం అందించారు.
ఈ క్రమంలోనే ఉగ్రవాదులు దట్టమైన అడవిలో చెట్టుకింద తవ్విన ఓ గుహలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అక్కడే వారిని చుట్టుముట్టి భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ముఠాలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 5-7 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ మహాదేవ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉండగా.. మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఆపరేషన్‌కు ఈ పేరు ఎందుకు ?
దాచిగామ్ సమీంలోని మహాదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్‌కు పేరు పెట్టారు. ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రదేశం జబర్వన్-మహదేవ్ పర్వతాల మధ్య ఉంది. అందుకే ఈ పేరు పెట్టారని సమాచారం. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా దళాలను నార్తర్న్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications