సూపర్ స్టార్ అలా.. లేడీ అమితాబ్ ఇలా.., చిన్నమ్మతో రాములమ్మకు లింకేంటీ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాట తన పొలికల్‌ ఎంట్రీపై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండగా.. మరోవైపు లేడీ అమితాబ్ విజయశాంతి మాత్రం వేగంగా పావులు కదుపుతున్నారు.

ఒకప్పుడు తెలంగాణలో తనకంటూ ప్రత్యేక ఉనికిని చాటుకున్న విజయశాంతి.. తాజాగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో దోషిగా జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే చీఫ్ శశికళను ఇటీవలే కలిసి వచ్చిన విజయశాంతి.. మరికొద్ది రోజుల్లో అన్నాడీఎంకేలో చేరబోతున్నట్లు సమాచారం.

సూపర్ స్టార్ కంటే ముందుగా...

సూపర్ స్టార్ కంటే ముందుగా...

జయలలిత మరణానంతరం చెన్నైలో ప్రత్యక్షమైన విజయశాంతి.. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్‌ తరఫున ప్రచారం చేశారు. సినీనటిగా విజయశాంతికి ఉన్న ఫాలోయింగ్‌, ఆమె రాజకీయ అనుభవం అన్నాడీఎంకేకు కలిసివస్తాయని భావించిన దినకరన్‌.. ఆ మేరకు శశికళను ఒప్పించినట్లు తెలిసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై నాన్చివేత ధోరణి అవలంభిస్తుండడంతో.. ఆయన పొలిటికల్ ఎంట్రీ కంటే ముందే విజయశాంతిని అన్నాడీఎంకేలోకి చేర్చుకోవడం ద్వారా లబ్దిపొందొచ్చన్నది దినకరన్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

శశికళ నుంచి ఆహ్వానం?

శశికళ నుంచి ఆహ్వానం?

ఈ నేపథ్యంలోనే ఈనెల 5న దినకరన్‌ బెంగళూరుకు వెళ్లి జైల్లో ఉన్న శశికళను కలుసుకున్నారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే రాములమ్మ విజయశాంతి కూడా చిన్నమ్మతో సమావేశమయ్యారు. ఇద్దరూ సుమారు 40 నిమిషాల పాటు పలు విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. దినకరన్‌ సూచన మేరకు శశికళ.. విజయశాంతిని అన్నాడీఎంకేలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నటిగా జనాకర్షణ, మహిళా నేత ఉంటే పార్టీని కట్టడి చేయడం సులభం అవుతుందని చిన్నమ్మ, దినకరన్‌ అంచనా వేసినట్లు పార్టీ వర్గాల కథనం.

బీజేపీతో మొదలై... సొంత పార్టీ స్థాపించి...

బీజేపీతో మొదలై... సొంత పార్టీ స్థాపించి...

నటిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి ‘లేడీ అమితాబ్‌ బచ్చన్‌' అనే బిరుదును పొందిన విజయశాంతి.. 1998లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత విజయశాంతి సొంతంగా‘తల్లి తెలంగాణ' పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి, టీఆర్ఎస్ లో నే ఉండిపోయారు.

తీరా తెలంగాణ వచ్చాక...

తీరా తెలంగాణ వచ్చాక...

అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, పస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పట్లో విజయశాంతికి టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ పోస్టు ఇచ్చి గౌరవించారు. అయితే తెలంగాణ ఏర్పాటు అనంతరం (2014 ఎన్నికల సమయంలో) విజయశాంతి అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఓటమిపాలై ఆ తరువాత చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. మళ్లీ జయలలిత మరణానంతరం చెన్నైలో ఆమె సందడి చేశారు.

జయలలితతోనూ అనుబంధం...

జయలలితతోనూ అనుబంధం...

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, విజయశాంతి ఇద్దరూ కెమెరా ముందు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. అయితే సినీరంగంలో ఉన్నప్పుడు ఇద్దరికి పరిచయం లేదు. మరి వీళ్లిద్దరి మధ్య అనుబంధం ఎప్పుడు మొదలైందంటారా? 1998లో బీజేపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాములమ్మ ప్రచారంలో భాగంగా ఓసారి జయలలితను చూశారట. ఫస్ట్ లుక్‌లోనే ఆమెపై మంచి అభిప్రాయం ఏర్పడిందని.. వెంటనే ఆమెను పరిచయం చేసుకున్నానని.. అప్పుడు మొదలైన పరిచయం జయ మరణం వరకూ కొనసాగిందని విజయశాంతి ఆ మధ్యన తెలిపారు.

చిన్నమ్మతో ఉన్న లింకేంటి?

చిన్నమ్మతో ఉన్న లింకేంటి?

ఇప్పుడు రాములమ్మ పొలిటికల్‌గా ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? తెలంగాణను వదిలేసి తమిళనాడు వైపు అడుగేసే ప్లాన్‌లో ఉందా? చిన్నమ్మ శశికళతో రాములమ్మకు ఉన్న లింకేంటి? పొలిటికల్‌గా బ్రేక్ మాత్రమే రీ ఎంట్రీ మాత్రం స్ట్రాంగ్‌గా ఉంటుందన్న లేడీ బాస్ అసలు ప్లాన్ ఏంటి? చిన్నమ్మను పరామర్శించడం వరకూ ఓకే కానీ ప్రస్తుతం చిన్నమ్మను మరోసారి కలవడం వెనకున్న ఆంతర్యమేంటి? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విజయశాంతి వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Is Vijayasanthi is planning to join AIADMK? What is the link between AIADMK Chief Sasikala and Vijayasanthi? Before the announcement from the Tamil Super Star Rajinikanth's political party, Dinakaran, the deputy chief of AIADMK wants to bring Vijayasanthi into Tamil Political limelight?
Please Wait while comments are loading...