Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ratan Tata: రతన్ టాటా ఆస్తుల విలువ ఎంత - ఇప్పుడు ఎవరి సొంతం..!!

రతన్ టాటా. దేశంలో పేరున్న బిజినెస్ టైకూన్. అంతకంటే అందరూ మెచ్చిన మానవాతా వాది. ఎందరో వ్యాపార దిగ్గజాలకు మార్గదర్శకుడు. లాభాల కంటే చిత్తశుద్దికి ప్రాధాన్యత ఇచ్చిన అరుదైన వ్యాపారవేత్త. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం. విద్య..వైద్య రంగాలకు భారీగా విరాళాలు ఇచ్చిన వ్యక్తి. కరోనా సమయంలో ఏకంగా రూ 1500 కోట్లు విరాళంగా అందించారు. అటువంటి రతన్ టాటా ఒక లేరు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న ఆయన ప్రస్తుత ఆస్తుల విలువ ఎంత..ఇప్పుడు ఆ ఆస్తులకు వారుసులు ఎవరు.

రతన్ టాటా జీవిత చరిత్ర తెలుసుకోండి..!

రతన్ టాటా ఆస్తులు
ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఇక లేరు. దేశంలో రతన్ టాటా తరువాత వ్యాపారాలు ప్రారంభించిన ఎందరో ప్రముఖుల వద్ద లక్షల కోట్ల లావా దేవీలు చేస్తున్నట్లు చూస్తూ ఉంటాం. కానీ, రతన్ టాటా ఆస్తుల లెక్కలు చూస్తూ ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ 29 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌ను పరిశీలిస్తే ఆగస్టు 20, 2024 నాటికి దాదాపు 403 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 33.7 లక్షల కోట్లు) ఉంది. ఇంత భారీ సామ్రాజ్యాన్ని విస్తరించిన రతన్ టాటా మాత్రం ఎప్పడూ నిరాడంబరంగానే ఉండేవారు. వ్యాపారం..సేవా రంగాల్లో ఖ్యాతి గడించిన రతన్ టాటా ఆస్తుల లెక్కలు మాత్రం ఆశ్చర్య కరంగానే ఉంటాయి.

What is the Ratan Tata Net Worth see details here

66 శాతం ఆదాయం సేవకే
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం ఆయన మొత్తం నికర విలువ కేవలం రూ. 3,800 కోట్లు. ఏడాది క్రితం అంటే 2021లో ఆయన మొత్తం సంపద రూ.3,500 కోట్లు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మొత్తం ఆస్తులు కంపెనీ మొత్తం ఆస్తుల్లో 0.50 శాతం కూడా లేదు. టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ ప్రకారం చూస్తే రతన్ టాటా సంపద ఏమీ లేదు. అయితే సంస్థ ఆదాయం మొత్తంలో 66 శాతాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంది. రతన్ టాటా తన కంపెనీల ఆదాయాలను స్వయంగా తీసుకోకుండా ట్రస్ట్ ద్వారా దేశం, తన ప్రజల కోసం ఖర్చు చేస్తారు. టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీలు టాటా ట్రస్ట్ కిందకు వస్తాయి, దీని హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్.

రతన్ టాటా వారసులు
రతన్ టాటాకు వివాహం కాలేదు. ఆయనకు వారసులు ఎవరనేది ఇప్పుడు చర్చగా మారింది. రతన్ టాటా తండ్రి రెండో భార్య సంతానం నోయెల్ టాటా. ప్రస్తుతం ఆయనే రతన్ టాటా ఆస్తులు చెందే అవకాశం కనిపిస్తోంది. నోయెల్ టాటాకు ముగ్గురు సంతానం. నోయెల్ కుమార్తె మాయా టాటా ప్రస్తుతం టాటా మెడికల్ ట్రస్టు బోర్డులో పని చేస్తున్నారు. మాయా తల్లి దివంగత టాటా గ్రూపు ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి. దివంగత బిలియనీజర్ పల్లోంజీ మిస్త్రీ కుమార్తె. రతన్ టాటా అంత్యక్రియలను మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తోంది. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+