వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సప్‌‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఫోన్‌తో కనెక్ట్ కాకుండానే ఛాట్ చేసే ఛాన్స్..

|
Google Oneindia TeluguNews

వాట్సప్. ఈ పేరు తెలియని వారుండరేమో. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ చెప్పుకునే వరకు ఈ యాప్‌ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వాట్సప్‌కు 1.4 బిలియన్ల యాక్టివ్ యూజర్లున్నారు. అయితే సిగ్నల్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ తదితర యాప్‌ల రాకతో బిజినెస్‌ దెబ్బతీనకుండా ఉండేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్‌తో ముందుకొస్తోంది. ఇందులో భాగంగా మరో సరికొత్త ఫీచర్‌ను కస్టమర్లకు అందించబోతోంది.

త్వరలోనే డెస్క్ టాప్ వెర్షన్

త్వరలోనే డెస్క్ టాప్ వెర్షన్

ఫేస్‌బుక్ మెసేజింగ్ యాప్ వాట్సప్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అతి త్వరలోనే కంపెనీ డెస్క్ టాప్ వెర్షన్ తీసుకురానుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూ ఫీచర్లను ప్రిడిక్ట్ చేసే వాబీటాఇన్ఫో సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇదే గనుక నిజమైతే డెస్క్ టాప్, పీసీల్లో వాట్సప్ వాడేందుకు ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవాల్సిన బాధ తప్పుతుంది.

ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరంలేదు

ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరంలేదు

2015లో వాట్సప్ వెబ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే డెస్క్ టాప్‌పై వాట్సప్ పనిచేయాలంటే మొబైల్‌లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడా ఇబ్బంది లేకుండా నేరుగా డెస్క్ టాప్ పైనే పనిచేసేలా యూనివర్సల్ వెబ్ ప్లాట్‌ఫాం యాప్ అందుబాటులోకి రానుంది. ఇదే గనుక జరిగితే ఫోన్‌లో డేటా లేకపోయినా మొబైల్ ఆఫ్‌లో ఉన్నా డెస్క్ టాప్ వెర్షన్ ద్వారా పనిచేసుకునే వెసలుబాటు కలుగుతుంది. అంతేకాదు.. ఒకే అకౌంట్‌పై పలు డివైజ్‌లలో ఒకేసారి పనిచేసుకునేలా వాట్సప్ దాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని నెలల్లో అందుబాటులోకి

మరికొన్ని నెలల్లో అందుబాటులోకి

వాట్సప్ డెస్క్ టాప్ వెర్షన్ వినియోగదారులకు ఎంతగానే ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ వర్క్ గ్రూప్‌లోని కొలీగ్స్‌తో చాట్ సెషన్ నిర్వహించేందుకు ఇది ఉపయోగపడనుంది. అయితే ఈ కొత్త యూనివర్సల్ వెబ్ పోర్టల్ వాట్సప్ యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న అంశంపై స్పష్టత లేదు. అయితే కంపెనీ దీన్ని మరికొన్ని నెలల్లోనే అందుబాటులోకి తెస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

English summary
WhatsApp is testing a new Universal Web Platform app that can work independently without active cellular connectivity on phone.This will greatly help professional users to communicate with their colleagues on the workgroup chat session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X