వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శెభాష్ మక్బూల్ : కర్ఫ్యూ ఉన్న గర్భిణీ ఆటోలో తీసుకెళ్లిన హీరో, డీసీపీ సహా పలువురి ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

డిస్పూర్ : అసోంలోని హైలాకండీలో జరిగిన ఘర్షణలతో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. గొడవలో ఒకరు చనిపోగా .. 15 మంది గాయపడ్డారు. ఆందోళనకారులు వాహనాలు, దుకాణాలను ధ్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. ఇలాంటి పరిస్థితిలో ఓ హిందు మహిళ ప్రసవం కోసం ప్రసవ వేదన పడింది.

నిస్సహాయ స్థితిలో ...

నిస్సహాయ స్థితిలో ...

భర్త అచేతనంగా చూస్తూ ఉండిపోయారు. హితులు, సన్నిహితులు, బంధువులు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఓ ముస్లిం సోదరుడు ముందుడుగు వేశాడు. విషయం తెలిసి .. తన ఆటోలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో దవాఖానకు చేరడంతో తల్లి, బిడ్డ ప్రాణాలు కాపాడటంతో అందరూ శెభాష్ అని మెచ్చుకుంటున్నారు. అసోంలోని హైలాకండీలో ఈ ఘటన జరిగింది. ఆటో వాలాను అందరూ ప్రసంశలతో ముంచెత్తుతున్నారు.

అంబులెన్స్ రాలేదు .. ఆటో వచ్చింది ...

అంబులెన్స్ రాలేదు .. ఆటో వచ్చింది ...

తన భార్య పురిటినొప్పులతో బాధపడటం చూసి అంబులెన్స్ కోం భర్త రుబెన్ దాస్ ప్రయత్నించాడు. అయితే ఎవరూ సాయం చేయడానికి ముందుకురాకపోవడంతో విలవిలలాడిపోయాడు. ఎవరి ద్వారానో విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్ మక్బూల్ .. వెంటనే స్పందించాడు. తన ఆటోలో గర్బిణీని ఆస్పత్రికి తీసుకెళ్లి తల్లి, బిడ్డల ప్రాణాన్ని కాపాడ్డాడు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నిచోట్ల మతం పేరుతో గొడవ పడుతుంటే మక్బూల్ చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. శెభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.

శెభాష్ మక్బూల్

శెభాష్ మక్బూల్

విషయం తెలిసి ఆస్పత్రిలో నందితను పరిశీలించారు డీసీపీ కీర్తి. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కర్ఫ్యూ ఉన్న తెగించి .. సాహసోపేతంగా ఆస్పత్రికి తరిలించిన మక్బూల్ ను ప్రశంసించారు. నువు చేసిన పని మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోంది అని అభినందించారు.

English summary
Curfew was imposed on the clash in Assam. Internet services are also discontinued. In such a situation, a Hindu woman was born with childbirth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X