బయటపడ్డ 900 ఏళ్ల నాటి బంగారు నాణేలు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కొండగావ్ జిల్లాలో సుమారు 900ఏళ్ల నాటి బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటిని 12వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు. రాష్ట్రంలోని కొండగావ్‌ జిల్లాలో కోర్‌కోటి, బెద్మా అనే రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం కోసం తవ్వగా పురాతనం కాలం నాటి కుండ బయటపడింది. అందులో 57 బంగారు నాణేలు, ఓ వెండి నాణెం, బంగారపు చెవిదిద్దు ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ నీల్‌కేతన్‌ వెల్లడించారు.

While Digging Earth, Labourer Finds Pot Of 900-Year-Old Gold Coins

జులై 10న అవి బయటపడగా కోర్‌కోటి సర్పంచి నెహ్రూలాల్ బాగెల్‌ శనివారం వాటిని కలెక్టర్‌కు అప్పగించారు. రోడ్డు నిర్మాణ సమయం ఓ మహిళా కూలీ ఈ కుండను గమనించి తోటి వారికి చెప్పగా విషయం గ్రామస్థులకు చేరిందని సర్పంచి తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ నాణేలు 12 లేదా 13వ శతాబ్దం నాటివని తెలుస్తోందని కలెక్టర్‌ తెలిపారు.

నాణేలపై ఉన్న గుర్తులను గమనిస్తే అవి పూర్వం విదర్భ ప్రాంతాన్ని పరిపాలించిన యాదవుల కాలంలోనివిగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలోని ఏడు జిల్లాలను కూడా అప్పట్లో యాదవుల పాలనలోనే ఉండేవని చెబుతున్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ అధికారుల నాణేలను పూర్తిగా పరిశీలిస్తారని కలెక్టర్‌ నీల్ కేతన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+