జమిలి ఎన్నికలతో ఆ పార్టీకే లాభం? తేల్చేసిన కమిటీ ఛీఫ్ రామ్ నాథ్ కోవింద్..!
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం, ఎన్నికల కమిషన్ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఓవైపు వీటి నిర్వహణ వల్ల ప్రయోజనం ఉంటుందని అందరూ చెప్తున్నా కేంద్రం మాత్రం తన రాజకీయ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా అడుగులేస్తోంది. ఓవైపు ఈసీ తాము జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగానే ఉన్నట్లు తేల్చేసింది. అటు లా కమిషన్ మాత్రం కాస్త సమయం పడుతుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన కమిటీ ఛైర్మన్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
జమిలి ఎన్నికలతో ఎవరికి ప్రయోజనం ఉంటుందని అడిగితే కేంద్రం, ఈసీ, లా కమిషన్, చివరికి జమిలి ఎన్నికల కమిటీ కూడా అందరికీ అంటున్నాయి. జమిలి ఎన్నికలతో భారీగా ప్రజాధనం, సమయం ఆదా అవుతాయని, కాబట్టి ఇవి అందరికీ ప్రయోజనం చేకూరుస్తాయని చెబుతున్నారు. కానీ ఇవాళ జమిలి ఎన్నికల కమిటీ ఛైర్మన్ రామ్ నాథ్ కోవింద్ మరో అడుగు ముందుకేసి ఏ పార్టీకి వీటితో ప్రయోజనం ఉంటుందో కూడా చెప్పేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకే జమిలి ఎన్నికలతో ప్రయోజనం ఉంటుందని మాజీ రాష్ట్రపతి కూడా అయిన రామ్ నాథ్ కోవింద్ తేల్చిచెప్పేశారు. అది బీజేపీ కావొచ్చు, కాంగ్రెస్ కావొచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే జమిలి ఎన్నికలకు లబ్ది చేకూరుతుందని అసలు విషయం చెప్పేశారు. దీంతో ఇప్పుడు రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం జమిలి ఎన్నికలకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు కచ్చితంగా బీజేపీయే రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని విపక్షాలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో కోవింద్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో విలేకరులతో మాట్లాడిన కోవింద్.. అన్ని జాతీయ పార్టీలతో మాట్లాడి జమిలి ఎన్నికలపై వారి సూచనలను కోరినట్లు చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సమయంలో దానికి మద్దతు ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎప్పుడో ఒకప్పుడు వీటికి మద్దతిచ్చిందని, దేశానికి మేలు జరిగేలా నిర్మాణాత్మకంగా సహకరించాలని అన్ని పార్టీలను అభ్యర్థిస్తున్నట్లు కోవింద్ వెల్లడించారు. ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశం అని తెలిపారు.
-
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications