రజనీకాంత్ నోట గుడ్ న్యూస్?: అన్ని పార్టీలకు అవసరమే, నేడు మాత్రం బిగ్ ఫైట్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు రాజకీయాల్లోకి వస్తారనే భయంతో ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలతో పాటు జాతీయపార్టీల నాయకుల్లో దడపుట్టుకుంది. రజనీకాంత్ కు ఎలాంటి రాజకీయ వైర్యం లేకపోయినా రాజకీయపరంగా ఇప్పుడు ఆయనకు శత్రువులుగా మారడానికి సిద్దం అవుతున్నారని సమాచారం.

రాజకీయాల్లోకి రజనీకాంత్: క్లారిటీ ఇచ్చేసిన ఆప్తమిత్రుడు, రాజ్ మాట అంటే !

అయితే కొందరు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. కొందరు నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. అయితే రజనీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంటూ నాయకులతో పాటు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

అందరినీ కలిశారు, అయితే ?

అందరినీ కలిశారు, అయితే ?

రజనీకాంత్ ఒక్క సారిగా రాజకీయాల గురించి చర్చ మొదలు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెడితే మరో సంచలనానికి తెరతీస్తారు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న రజనీకాంత్ రాజకీయాల్లో అడుగుపెడితే ఏం జరుగుతుందో ? అంటూ రాజకీయ నాయకులకు టెన్షన్ మొదలైయ్యింది.

దేశ, విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు

దేశ, విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు

రజనీకాంత్ అనేక మంది రాజకీయ నాయకులను కలిశారు. దక్షిణ భారతదేశంతో పాటు దేశ, విదేశాల్లో రజనీకాంత్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రముఖు నాయకులతో రజనీకాంత్ కు పరిచయం ఉంది.

రజనీకాంత్ ఇంటికి క్యూ కట్టిన నాయకులు

రజనీకాంత్ ఇంటికి క్యూ కట్టిన నాయకులు

చెన్నై వెళ్లిన అనేక మంది రాజకీయ నాయకులు రజనీకాంత్ ఇంటికి క్యూ కట్టారు. ప్రతిసారి జరిగే ఎన్నికల్లో రజనీకాంత్ మద్దతు తీసుకోవడానికి పలు పార్టీల నాయకులు పోటీపడిన సందర్బాలు చాలనే ఉన్నాయి. అయితే ఇంత కాలం బహిరంగంగా ఏ పార్టీకి ఆయన మద్దతు ప్రకటించలేదు.

ఏ పార్టీకి ఇంత వరకు మద్దతు ఇవ్వలేదు

ఏ పార్టీకి ఇంత వరకు మద్దతు ఇవ్వలేదు

రజనీకాంత్ తన అభిమానులకు మీరు ఈ పార్టీకి ఓటు వెయ్యండి అని చెప్పిన సందర్బాలు లేవు. అయితే రజనీకాంత్ మాట అంటే ఆయన అభిమానులకు వేదవాక్కు. రజనీకాంత్ ఏం చెబితే అది చెయ్యడానికి ఆయన అభిమానులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు.

మర్యాదపూర్వకంగా కలిశారు

మర్యాదపూర్వకంగా కలిశారు

రజనీకాంత్ అనేక మందిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్బాలు చాలనే ఉన్నాయి. కొన్నిసార్లు ఆయన పలు రాజకీయ పార్టీల నాయకుల ఇంటికి వెళ్లి కలిశారు. కొందరు నాయకులు ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. అయితే తాముమర్యాదపూర్వకంగానే కలిశామనే విషయం రజనీకాంత్ అనేక సార్లు మీడియాకు చెప్పారు.

రాజకీయాలు అంటే ఇవేనా ?

రాజకీయాలు అంటే ఇవేనా ?

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంటే పలువురు రాజకీయ పార్టీల నాయకులు హడలిపోతున్నారు. ఎక్కడ సొంత పార్టీ పెట్టుకుని మా ఓట్లు చీల్చుతారో అంటూ ఆందోళన చెందుతున్నారు. పనిలో పనిగా రజనీకాంత్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

రజనీకాంత్ నోట గుడ్ న్యూస్ వస్తుందా ?

రజనీకాంత్ నోట గుడ్ న్యూస్ వస్తుందా ?

తమ అభిమాన నాయకుడి నోటి నుంచి గుడ్ న్యూస్ వస్తోందని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎక్కువ శాతం మంది అభిమానులు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాను అని చెబితే మాత్రం నిరుత్సాహపడుతామని ఆయన అభిమానులు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Political circles are debating why actor Rajinikanth is start talking about politics all of a sudden.
Please Wait while comments are loading...