• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Omicron Virus: ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు, ఏం జరుగుతోంది..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ దేశంలో తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునేలోపే ఓమిక్రాన్ అనే మరో కొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తింపబడ్డ ఈ వైరస్.. ఆ తర్వాత ఐరోపా ఆసియా దేశాల్లో కూడా కేసులు బయటపడ్డాయి. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇది పలు రకాలుగా రూపాంతరం చెందుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా ఇది ప్రభావం చూపే ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయా దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించడమే కాకుండా వారి దేశాల్లో కరోనావైరస్‌కు తయారవుతున్న వ్యాక్సిన్ ఎంతమేరకు ఓమిక్రాన్ వైరస్‌ను నిలువరించగలదనేదానిపై వ్యాక్సిన్ తయారీదారులతో ప్రభుత్వాలు చర్చిస్తున్నాయి.

శాస్త్రవేత్తలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

శాస్త్రవేత్తలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

శుక్రవారం రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ B.1.1.529 వేరియంట్‌ను కరోనా వైరస్‌కు రూపాంతరంగా ఉందని ప్రకటించింది. ఇది కరోనావైరస్‌ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ప్రస్తుతానికి డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్‌గా గుర్తించగా... దీనికి మించి అన్నట్లుగా ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఓమిక్రాన్ వైరస్‌ 30 రకాల మ్యూటేషన్స్‌గా ఉందని చెబుతున్నారు. ఇక దక్షిణాఫ్రికాలో మరిన్ని ఓమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కరోనావైరస్‌ కోసం తయారు చేసిన కొన్ని వ్యాక్సిన్‌లు ఓమిక్రాన్ వైరస్‌ను నిలువరించలేవని వైద్యులు చెబుతున్నారు.

తెలియని అంశాలతో ఆందోళన

తెలియని అంశాలతో ఆందోళన

ఇక ఓమిక్రాన్ వైరస్ గురించి పూర్తిస్థాయి సమాచారం ఇచ్చేందుకు కొన్ని వారాలు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వైరస్‌ను కచ్చితంగా నిర్వచించేందుకు అదే సమయంలో ఈ వైరస్ సోకితే ఎలాంటి వ్యాధులు వస్తాయని చెప్పేందుకు, ఇది ఎంత ప్రమాదకరమో తెలిపేందుకు, ఇప్పటికే ఎంత వేగంగా వ్యాప్తి చెందిందని స్పష్టం చేసేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ లోగ కొంత మేర నష్టం వాటిల్లే అవకాశం సైతం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. ఇక బీటా వేరియంట్‌ను కూడా తొలుత దక్షిణాఫ్రికాలోనే గుర్తించడం జరిగింది. ఆ తర్వాత డెల్టా వైరస్ దీన్ని రీప్లేస్ చేసింది. అయితే మరో ఆందోళన సైతం వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 8 బిలియన్ డోసుల వ్యాక్సిన్‌లను ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా విస్తరిస్తున్న ఓమిక్రాన్ వైరస్‌ను ఈ టీకాలు నిలువరించగలుగుతాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక ఓమిక్రాన్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా కచ్చితంగా చెప్పలేకున్నారు. కరోనా కంటే ఇది తీవ్రంగా ఉంటుందా లేదా అనే విషయంపై కూడా క్లారిటీ లేదు.

దీనిపై ఎవరు ఎలా స్పందించారు

దీనిపై ఎవరు ఎలా స్పందించారు

ఓమిక్రాన్ వైరస్‌ ఇంకా అధికారికంగా అమెరికాలో గుర్తించలేదని అయితే ఇప్పటికే ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించి ఉంటుందనే అనుమానాలు అక్కడి శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు. ఇప్పటికే కొత్త వైరస్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ముందు కోవిడ్ వైరస్‌ ధరలు గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చాయి. ఇక దక్షిణాఫ్రికాకు వెళ్లకుండా కొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. ఇక శీతాకాల సెలవుల సందర్భంగా చాలామంది దక్షిణాఫ్రికాకు వెళ్లే అవకాశం ఉన్నందున ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఓమిక్రాన్ వైరస్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, అన్ని కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని చెబుతున్నారు. జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండకూదని, మంచి వెలుతురు గాలి ఉన్న గదుల్లో ఉండాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని సూచిస్తున్నారు.

English summary
With the Omicron variant making its way Scientists are worried and they had giving the directions as what to do and what not to do.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X