Wife: భర్త మీద కోపం, బిడ్డల మీద కసి తీర్చుకుంటున్న భార్య, భర్తకు మండిపోయి కత్తితో ఇష్టం వచ్చినట్లు !
ముంబాయి: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా వైరస్ దెబ్బతో పిల్లలు ఆన్ లైన్ లో చదువుకుంటున్నారు. ఆన్ లైన్ క్లాసులు పూర్తి అయిన తరువాత పిల్లలను తల్లి చదివిస్తోంది. ఈ మద్య కాలంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. చిన్నచిన్న విషయాలకు దంపతులు గొడవపడుతున్నారు. భర్త మీద కోపంతో అతని భార్య కన్న బిడ్డలను పట్టుకుని చితకబాదుతోంది. పిల్లలను కొట్టకూడదని, వారికి బుద్దిమాటలు చెప్పి దారిలోకి తెచ్చుకోవాలని భర్త అతని భార్యకు ముందునుంచి దేపదే చెబుతున్నాడు. అయితే భోజనం చేసే సమయంలో పిల్లలు సరిగా చదువుకోలేదని నెపంతో అతని భార్య ఇద్దరు పిల్లలను పట్టుకుని చితకబాదేసింది. భర్తకు ఎక్కడో మండిపోయి కత్తి తీసుకుని భార్య గొంతు, కడుపు తదితర చోట్ల ఇష్టం వచ్చినట్లు దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది.

ఇద్దరు పిల్లలు
ముంబాయిలోని వకోలా ప్రాంతంలోని శాస్త్రీ నగర్ లో అవినాష్ వార్పే అలియాస్ అవినాష్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జయశ్రీ అనే యువతిని అవినాష్ వివాహం చేసుకున్నాడు జయశ్రీని వివాహం చేసుకున్న అవినాష్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. అవినాష్, జయశ్రీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

దంపతుల మద్య గొడవలు
కరోనా వైరస్ దెబ్బతో అవినాష్, జయశ్రీ దంపతుల పిల్లలు ఆన్ లైన్ లో చదువుకుంటున్నారు. ఆన్ లైన్ క్లాసులు పూర్తి అయిన తరువాత పిల్లలను జయశ్రీ చదివిస్తోంది. ఈ మద్య కాలంలో అవినాష్, జయశ్రీ దంపతుల మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. అవినాష్, జయశ్రీ దంపతుల మద్య గొడవలు రానురాను ఎక్కువ అయ్యాయి.

భర్త మీద కోపంతో పిల్లలను చితకబాదుతున్న భార్య
చిన్నచిన్న విషయాలకు అవినాష్, జయశ్రీ దంపతులు గొడవపడుతున్నారు. భర్త అవినాష్ మీద కోపంతో అతని భార్య జయశ్రీ కన్న బిడ్డలను పట్టుకుని చితకబాదుతోంది. పిల్లలను కొట్టకూడదని, వారికి బుద్దిమాటలు చెప్పి దారిలోకి తెచ్చుకోవాలని అవినాష్ అతని భార్య జయశ్రీకి ముందునుంచి దేపదే చెబుతూ వస్తున్నాడని సమాచారం.

ఆవేశంతో ఊగిపోయిన భార్య
మంగళవారం మద్యాహ్నం భోజనం చేసే సమయంలో పిల్లలు సరిగా చదువుకోలేదని నెపంతో అవినాష్ భార్య జయశ్రీ ఆమె ఇద్దరు పిల్లలను పట్టుకుని చితకబాదేసింది. ఆ సమయంలో అవినాష్ అడ్డుపడినా కూడా జయశ్రీ కోపం తట్టుకోలేక పిల్లలను కర్ర తీసుకుని చితకబాదింది. ఆ సమయంలో అవినాష్ కు ఎక్కడో మండిపోయింది.
Recommended Video

భార్యను కత్తితో కసకసా పొడిచేసిన భర్త
అవినాష్ ఎంత చెప్పినా జయశ్రీ మాత్రం ఊగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన అవినాష్ కత్తి తీసుకుని అతని భార్య జయశ్రీ మెడ మీద, గొంతు, కడుపు తదితర చోట్ల ఇష్టం వచ్చినట్లు దారుణంగా పొడిచేశాడు. జయశ్రీ గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జయశ్రీని ఆసుపత్రికి తరలించామని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని డీసీపీ డీఎస్, స్వామి మీడియాకు చెప్పారు. భార్య జయశ్రీని కత్తితో పొడిచి పారిపోయిన అవినాష్ కొన్ని గంటల తరువాత పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడని డీసీపీ స్వామి తెలిపారు.












Click it and Unblock the Notifications