Wife: పుట్టింటిలో భార్య, కూతుర్ని కాపురానికి పంపించలేదని అత్తను అల్లుడు ఏం చేశాడంటే ?, క్లైమాక్స్ !
చెన్నై/ తిరువళ్లూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోంగా కాపురం చేశారు. దంపతులకు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్తతో గొడవ పడుతున్న భార్య ఆమె పుట్టింటికి వెళ్తిపోతున్నది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడం, ఆమెకు నచ్చచెబుతున్న భర్త ఆమెను మళ్లీ అతని ఇంటికి పిలుచుకుని వెళ్లడం మామాలు అయిపోయింది, ఎప్పటిలాగే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. గొడవపడి వెళ్లిన భార్యను పిలుచుకురావడానికి భర్త అత్తారింటికి వెళ్లాడు. అక్కడ ఒకరు హత్యకు గురి కావడం కలకలం రేపింది.

దంపంతుల మధ్య గొడవలు
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కుమ్మిడిపూండి సమీపంలోని పెత్తికుప్పం ప్రాంతంలో కల్యాణి (58) అనే మహిళ నివాసం ఉంటున్నది. కల్యాణి చిన్న కూతురు కస్తూరిని కొన్ని సంవత్సరాల క్రితం కుప్పన్ అలియాస్ కుప్పుసామి (47) అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం జరిగిన తరువాత కుప్పస్వామి, కస్తూరి దంపతులు సంతోషంగా ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత కుప్పస్వామి, కస్తూరి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

మద్యంకు బానిస అయిన భర్త
కుప్పస్వామి మద్యానికి బానిస అయ్యాడు. భర్త కుప్పస్వామి విపరీతంగా మద్యం సేవించడంతో అతని భార్య కస్తూరి ఎక్కువగా గొడవలు పడటం మొదలుపెట్టింది. భర్త కుప్పస్వామితో గొడవ పడిన కస్తూరి నాలుగు రోజుల క్రితం ఎప్పటిలాగే ఆమె తల్లి కల్యాణి ఇంటికి వెళ్లిపోయింది. భార్య కస్తూరి ఇంటికి తిరిగి వస్తుందని ఎదురు చూసిన కుప్పస్వామి చివరికి ఆమెను పిలుచుకుని రావడానికి అత్తగారింటికి వెళ్లాడు.

వంట గదిలో కత్తి తీసుకుని ?
అప్పుడు కుప్పస్వామికి అతని అత్త కల్యాణి మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అని ఇద్దరూ రెచ్చిపోయారు.ఆ సందర్బంలో రగిలిపోయిన కుప్పస్వామి వంటగదిలో ఉండే కత్తి తీసుకుని అతని అత్త కల్యాణి వీపుపై, చేతిపై ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. తీవ్రగాయాలైన కల్యాణి రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న కుమ్మిడిపూండి పోలీసులు కల్యాణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన అల్లుడు
అత్త కల్యాణిని హత్య చేసిన కుప్పస్వామి మొదట పారిపోయినా కొన్ని గంటల తరువాత నేరుగా వెళ్లి కుమ్మిడిపూండి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కుప్పస్వామిని పోలీసులు విచారిస్తున్నారు. నిత్యం తన భార్య కస్తూరికి లేనిపోని మాటలు చెబుతున్న మా అత్త కల్యాణి మా సంసారం నాశనం చేస్తోందని, అందుకే చంపేశానని కుప్పస్వామి పోలీసులకు చెప్పాడని తెలిసింది. భార్య కోసం వెళ్లిన కుప్పస్వామి అతని అత్త కల్యాణిని హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications