luxury life: ప్రియుడు ఏం చేస్తాడో తెలీదు, లవ్ మ్యారేజ్, చేతివృత్తి నేర్పించిన భర్త, క్లైమాక్స్ లో భార్యకు ?

బెంగళూరు: ఇన్ స్టాగ్రామ్ లో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం చాటింగ్ తో కాలం గడిపిన సోషల్ మీడియా ఫ్రెండ్స్ తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రియుడు ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోకుండా ఆమె అతన్ని పెళ్లి చేసుకుంది. కొంతకాలం దంపతులు సంతోషంగా కాపురం చేశారు. తరువాత భర్త అతని చేతివృత్తిని అతని భార్యకు కూడా నేర్పించాడు. అప్పటి నుంచి దంపతులు ఇద్దరూ పగలు, రాత్రి బయట తిరుగుతూ వాళ్లపనివాళ్లు చేసుకుంటూ పోతున్నారు. అన్ని విషయాల్లో భర్తకు సహకరిస్తున్న భార్య విలాసవంతమైన జీవితం గడిపింది. అయితే గ్రహాలు అనుకూలించకపోవడంతో దంపతులు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం

బెంగళూరులో బనశంకరని 3వ స్టేజ్ లోని వీరభ్రద నగర్ లో నాగరాజు (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బెంగళూరులోని వేరే ప్రాంతంలో రమ్యా (23) అనే యువతి నివాసం ఉంటున్నది. మూడు సంవత్సరాల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో నారాజ్, రమ్యాకు పరిచయం అయ్యింది. కొంతకాలం నాగరాజు, రమ్యా సోషల్ మీడియా చాటింగ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ అయ్యారు.

లవ్ మ్యారేజ్... గుడ్డిగా వెళ్లిపోయింది

లవ్ మ్యారేజ్... గుడ్డిగా వెళ్లిపోయింది

రెండు సంవత్సరాల తరువాత ల నాగరాజ్, రమ్యా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రియుడు నాగరాజ్ ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోకుండా రమ్యా అతన్ని గుడ్డిగా పెళ్లి చేసుకుంది. కొంతకాలం నాగరాజ్, రమ్యా దంపతులు బనశంకరిలోని అద్దె ఇంటిలో సంతోషంగా కాపురం చేశారు. తరువాత నాగరాజ్ అతను ఏం పని చేస్తున్నాడో అతని భార్య రమ్యాకు చెప్పాడు.

నేను భలేదొంగ తెలుసా ?

నేను భలేదొంగ తెలుసా ?

తరువాత రమ్యా నువ్వు ఏం పని చేస్తున్నావు ? అని ఆమె భర్త నాగరాజ్ ను అడిగింది. నేను దొంగను, ఇంత వరకు ఒక్కసారికూడా పోలీసులకు చిక్కలేదు, నా టాలెంట్ తో తప్పంచుకుంటున్నాను అని అతని భార్య రమ్యాకు చెప్పాడు. నాగరాజ్ అతని చేతివృత్తిని అతని భార్య రమ్యాకు కూడా నేర్పించి ఆమెను కూడా దొంగను చేశాడు.

బయట కాపలా ఉంటున్న భార్య

బయట కాపలా ఉంటున్న భార్య

ఇళ్లకు తాళాలు వేసిన విషయం గుర్తిస్తున్న నాగరాజ్, రమ్యా దంపతులు తరువాత నకిలి తాళాలతో ఇళ్లలో బంగారు నగలు, నగదు చోరీ చేస్తున్నారు. నాగరాజ్ ఇళ్లలోకి వెళ్లి చోరీలు చేస్తుంటే ఇంటి బయట అతని భార్య రమ్యా కాపలాఉంటున్నదని, ఎవరైనా వస్తే వారిని పక్కదారి పట్టించి భర్త చిక్కకుండా చేస్తోందని బెంగళూరు పోలీసులు అన్నారు.

అడ్డంగా చిక్కిపోయిన కిలాడీ దంపతులు

అడ్డంగా చిక్కిపోయిన కిలాడీ దంపతులు

కేబుల్ ఆపరేట్ ఇంటిలో చోరీ చేస్తున్న సమయంలో నాగరాజ్, రమ్యా దంపతులకు పోలీసులకు చిక్కిపోయారు. బెంగళూరులోని రాజరాజేశ్వరినగర, మాదనాయకనహళితో పాటు పలు పోలీస్ స్టేషన్లలో దంపతుల మీద కేసులు నమోదు అయ్యాయని, నాగరాజ్, రమ్యా దంపతుల నుంచి రూ. 5.25 లక్ష్ల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+