రాజకీయాల్లో రాఖీ సావంత్: పార్టీ గుర్తు మిరపకాయ్!

ఆగ్రా: బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ వచ్చే లోకసభ ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ వస్తే ఆ పార్టీ నుంచే బరిలో దిగుతానని రాఖీ సావంత్ చెబుతోంది. లేదంటే తాను ఒంటరిగానే లోకసభ ఎన్నికల్లో పోటీకి దిగుతానని స్పష్టం చేసింది.

అంతేగాక తను కొత్త పార్టీని పెడుతున్నట్లు కూడా రాఖీ సావంత్ ప్రకటించింది. తన పార్టీ గుర్తు గ్రీన్ చిల్లీ (పచ్చి మిరపకాయ) అని రాఖీ పేర్కొంది. సోమవారం ఆగ్రా వచ్చిన రాఖీ సావంత్ ప్రముఖ జైన మత గురువు పులక్ సాగర్‌ను కలిశారు. ఆయన ఆశీర్వాదాలు తీసుకునేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపింది. ఆయనతో ఏకాంతంగా రాఖీ సమావేశమయ్యారు.

Will either contest polls as BJP candidate or as an Independent, says Rakhi Sawant

ఆ తర్వాత మీడియా ముందకు వచ్చి తన పార్టీ ప్రణాళికల గురించి పేర్కొంది. రెండు రోజుల్లో తన పార్టీ పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపింది. తాను గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. మోడీని ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు పేర్కొంది. అంతేగాక తాను ఇకపై ఐటమ్ గర్ల్ కాక ఇతర మంచి పాత్రలు వస్తేనే సినిమాల్లో నటిస్తానని తేల్చి చెప్పింది.

తనపై ఉన్న ఐటమ్ గర్ల్ ముద్రను తొలగించే ప్రయత్నంలోనే రాఖీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని పలువురు భావిస్తున్నారు. కాగా, మహారాష్ట్రలోని ముంబై-నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకుడు గురుదాస్ కామత్‌పై రాఖీ పోటీ చేయనుందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+