రాహుల్ సవర్కార్ మంటలు:పరువునష్టం దావా వేస్తామంటోన్న వీర్ సవర్కార్ మనమడు, ఉద్దవ్‌తో భేటీ
Recommended Video
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన రాహుల్ సావర్కార్ వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామ్యపక్షం శివసేన కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో విభేదించింది. బీజేపీ నేతలు రాహుల్ కామెంట్లను తప్పుపడుతున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఒంటికాలిపై లేచారు.

పరువు నష్టం దావా..
స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కార్ మనమడు రంజిత్ సావర్కార్ రాహుల్ గాంధీ కామెంట్లపై స్పందించారు. తమ తాత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఆయనపై పరువునష్టం దావా కేసు వేస్తామని చెప్పారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరేతో కూడా రంజిత్ సావర్కార్ సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ కామెంట్లపై చర్చించారు.

నెహ్రూ కూడా..
సావర్కార్ గురించి రాహుల్ గాంధీ అలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో జవహర్ లాల్ నెహ్రూ కూడా శివాజీని దొంగ అని అన్నారు. తర్వాత క్షమాపణ కూడా చెప్పిన విషయాన్ని రంజిత్ గుర్తుచేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబీకులు తప్పులు చేస్తూనే ఉంటారని పరోక్షంగా ప్రస్తావించారు. రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకోవాలని కోరారు.

బయటకు రండి
అంతేకాదు సావర్కార్‌పై వ్యాఖ్యలు చేసిన శివసేన.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగించొద్దని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి, సమయం అయిపోగానే కొత్త ప్రభుత్వం వస్తోంటాయి. కానీ వ్యక్తులపై విమర్శలు మాత్రం సరికాదని రంజిత్ తేల్చిచెప్పారు. అంతేకాదు స్వాతంత్ర్య సమరయోధులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. సావర్కార్‌ను విమర్శించిన కాంగ్రెస్ పార్టీ మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

రాహుల్ సావర్కార్ కాదు..
శనివారం భారత్ బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో జరిగిన ర్యాలీలో రేప్ ఇన్ ఇండియా అని కామెంట్ చేశారు. మేక్ ఇన్ ఇండియా లేదని.. అత్యాచార భారత్ అని ఫైరయ్యారు. దీనిపై శుక్రవారం పార్లమెంట్‌లో దుమారం కొనసాగింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. దీనిపై భారత్ బచావో ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. తాను తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పబోనని తేల్చిచెప్పారు. తాను రాహుల్ గాంధీని అని.. రాహుల్ సావర్కార్ కాదని అనడంతో దుమారం రేగింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications