40 సీట్లు దాటితే ఉరేసుకుంటావా : మోదీకి ఖర్గే సవాల్
న్యూఢిల్లీ : ఎన్నికల సమరంలో నేతల మధ్య మాటలదాడి తీవ్రస్థాయికి చేరింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. గత లోక్ సభ ఎన్నికల కన్నా కాంగ్రెస్ తక్కువ సీట్లు గెలుచుకుంటుందని మోదీ అగ్గిరాజేశారు. ఇందుకు హస్తం నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సహా .. ఆ పార్టీ అగ్రనేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

40 సీట్లే ?
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ కు పరిమితం అవుతుందన్నారు మోదీ. 2014లో గెలిచిన 40 సీట్లు కూడా గెలవదని విమర్శించారు. దీనిపై లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయని మోదీకి ఏం తెలుసు అని ప్రశ్నించారు ఖర్గే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే ఏం చేస్తావని ప్రశ్నించారు. ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఉరితీసుకుంటారా అని సవాల్ విసిరారు.
మాటల మంటలు
ఇప్పుడే కాదు గత వారం నుంచి మోదీ, ఖర్గే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజీవ్ గాంధీ అవినీతిపరుడని మోదీ కామెంట్ చేయగా .. అదేస్థాయిలో ఖర్గే రియాక్టయ్యారు. దీంతో మోదీకి విలువులు లేవని అర్థమవుతోందని ధీటుగా స్పందించారు. అంతేకాదు యవ్వనంలోనే మోదీ ఇంటి నుంచి పారిపోయారని .. ఇక ఆయనకు విలువలు మంచి చెడు ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఇంట్లో, పారిపోయి చేరిన ఇంట్లోనే మోదీ మంచి నేర్చుకోలేదని విమర్శించారు. ఆయన ఎక్కడ మంచితనం నేర్చుకున్నారు. కానీ ఆయనకు బుద్ది చెప్పేది ప్రజలేనని స్పష్టంచేశారు. మోదీ నోటిదురుసుకు ప్రజలే గుణపాఠం చెప్తారని తెలిపారు.
రాజకీయ దుమారం
మోదీపై ఉరితీసుకోవాలనే ఖర్గే వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేప అవకాశం ఉంది. దీనిపై బీజేపీ నేతలు స్పందించాల్సి ఉంది. అసలే కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం జరగుతోన్న వేళ ఖర్గే హాట్ కామెంట్స్ మరోసారి అగ్గిరాజేసే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి. మరో విడత పోలింగ్ ఉన్న సమయంలో అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు పీక్ స్టేజీకి చేరాయి.












Click it and Unblock the Notifications