• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వచ్చేది చలికాలం..!ఆస్తమా రోగుల పట్ల శాపంగా మారనున్న కరోనా.!డబ్ల్యూహెచ్ వో హెచ్చరికలు.!

|

హైదరాబాద్ : దేశంలో కరోనా మహమ్మారి రోజురోకుకూ విజృంభిస్తోంది తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ప్రపంచ దేశాలు కరోనా విరుగుడు వ్యాక్సీన్ కనిపెట్టడంలో పోటీ పడుతూ అదుగో వ్యాక్సీన్ ఇదుగో వ్యాక్సీన్ అంటున్నప్పటికి ఇప్పటివరకూ ఎలాంటి వ్యాక్సీన్ వెలుగుచూడలేదు. దీంతో కరోనా నిర్దారణ ఐన రోగులు భయం భయంగానే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండాకాలం సమయంలో అంటే గత మార్చిలో ఈ కరోనా వైరస్ భారతదేశం మీద విరుచుకుపడింది.

భారత్‌లో ఆ మూడు కరోనా వ్యాక్సిన్లు... ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి... కీలక అప్‌డేట్...

 ముందుంది చలి కాలం.. కరోనా భయంతో వణికిపోతున్న జనం..

ముందుంది చలి కాలం.. కరోనా భయంతో వణికిపోతున్న జనం..

ఆ తర్వాత వర్షాకాలంలో దీని ఉదృతి విపరీతంగా ఉంటుందనే చర్చ జరిగింది. ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్ధ కూడా వానా కాలంలో కరోనా వైరస్ మరింతి వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు కూడా జారీ చేసింది. దానికనుగుణంగానే దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. ఎండ తీవ్రతకు కరోనా వైరస్ కదలికల్లో స్తబ్దత చోటుచేసుకుంటుందని, భారత దేశం లాంటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే దేశంలోఇది మనుగడ సాధించలేదని నిపుణులు చెప్పినప్పటికి అవన్ని కట్టుకథలని కరోనా వైరస్ నిరూపించింది.

 ఆస్తమా రోగుల పరిస్దితి ప్రశ్నార్థాకమే.. హెచ్చరికలు జారీ చేస్తున్న డబ్ల్యూహెచ్ వో..

ఆస్తమా రోగుల పరిస్దితి ప్రశ్నార్థాకమే.. హెచ్చరికలు జారీ చేస్తున్న డబ్ల్యూహెచ్ వో..

దాని కనుగుణంగా దేశంలో కరోనా విస్తృతంగా వ్యాపించింది. ప్రపంచంలో కరోనా వేగంగా విస్ధరిస్తున్న దేశాలతో పోటీ పడుతూ రెండో స్ధానానికి ఎగబాకింది భారత దేశం. కరోరా మహమ్మారి విజృంభిస్తూ పాజిటీవ్ కేసులు పెరుగుతున్నప్పటికి మరణాల రేటు తక్కువగా ఉండడం కాస్త ఊరటకలిగించే అంశంమని తెలుస్తోంది. ఐతే వచ్చే చలికాలం సీజన్ నాటాకి ఈసారి ఆస్తమా రోగుల పట్ల కరోనా శరాఘాతంలా పరిణమించే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

 చలికాలం రాకముందే వణికిపోతున్న జనం.. హృద్రోగులకు శరాఘాతం కానున్న కరోనా..

చలికాలం రాకముందే వణికిపోతున్న జనం.. హృద్రోగులకు శరాఘాతం కానున్న కరోనా..

నవంబర్ నెల నుండి చలి తీవ్రంగా ప్రభావం చూపనుండడంతో ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులతో పాటు ఆస్తమా, హృద్రోగులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 60నుండి 70ఏళ్ల వయసు వారికి కరోనా వైరస్ సోకితే ముందుగా అది ఊపిరి తిత్తుల మీద ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ కొన్నిసందర్బాల్లో ప్రాణాలను సైతం కోల్పోతున్న సందర్బాలు తలెత్తుతున్నాయి.

 అప్రమత్తంగా ఉండాలి.. ముందస్తు జాగ్రత్తలు వివరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..

అప్రమత్తంగా ఉండాలి.. ముందస్తు జాగ్రత్తలు వివరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..

ఇప్పటికే పరిస్దితులు ఈ విధంగా ఉంటే రాబోవు చలికాలంలో హృద్రోగులు ఎలా తట్టుకుంటారన్నది కూడా ప్రశ్నార్ధాకంగా తయారయ్యింది. ఇదే అంశం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్ధ వివిధ కోవిడ్ బాదిత దేశాలకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో భాగంగా చలికాలంలో ఆస్తమా రోగులు అనుసరించాల్సిన విధానాలు, శ్వాసకు సంబంధించిన ముందు జాగ్రత్తలను వివరించినట్టు తెలుస్తోంది. దాంతో చలికాలంలో కరోనా వల్ల సంభవించే అత్యదిక మరణాలను అరికట్టాలని సూచించారు. ఇక వచ్చే చలికాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస్తమా రోగుల పట్ల కరోనా ఏవిధమైన పంజా విసురుతుందో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి.

English summary
It is also questionable how heart patients will cope in the coming winter. The World Health Organization has issued guidelines to various Kovid-affected countries on the same subject.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X