వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో కరోనా కల్లోలం: రెండో రోజూ 25వేలకుపైగా కేసులు, నాగ్‌పూర్‌లో అత్యధికం

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం కూడా రాష్ట్రంలో 25వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 25,681 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. గురువారం కూడా 25,853 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక గత 24 గంటల్లో రాష్ట్రంలో 70 కరోనా మరణాలు నమోదయ్యాయి. 2.20 శాతానికి మరణాల రేటు పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,80,83,977 కరోనా పరీక్షలను నిర్వహించారు. 24,22,021 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. 13.39 శాతం పాజిటివ్ రేటు ఉంది. 8,67,333 కరోనా బాధితులు హోం క్వారంటైన్లో ఉండగా, 7,848 మంది ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు.

 With 25,681 new Covid-19 cases, Maharashtra records 25k+ cases in straight two days

ప్రస్తుతం మహారాష్ట్రలో 1,77,560 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో సగానికంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఇక్కడే ఉండటం గమనార్హం.

రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో యాక్టివ్ కేసులు:

ముంబై: 3,063 కేసులు
పుణె: 2,872 కేసులు
ఔరంగాబాద్: 1,313 కేసులు
నాగ్‌పూర్: 2,617 కేసులు

జిల్లాల వారీగా అత్యధిక యాక్టివ్ కేసులు ఇలా

ముంబై: 18,850 కేసులు
థానే: 16,735 కేసులు
పుణె: 37,384 కేలు
నాసిక్: 11,867 కేసులు
ఔరంగాబాద్: 11,524 కేసులు
నాగ్‌పూర్: 25,861 కేసులు

English summary
Maharashtra reported more than 25,000 new Covid-19 cases for the second consecutive day on Friday. The state reported 25,681 new cases, the second highest single-day count in 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X